సోమవారం, 2 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 12 జులై 2018 (12:16 IST)

టైమ్ పాస్ కోసం తింటున్నారా..? ఐతే జాగ్రత్త సుమా..

టైమ్ పాస్ కోసం.. ఆకలేయకపోతున్నా.. సరదాగా స్నేహితులతో కలిసి తింటున్నారా..? అయితే అనారోగ్య సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. సాధారణంగా ఆకలిగా లేనప్పుడు తినే తిండి అనారోగ్యం కలిగిస్తుందని వ

టైమ్ పాస్ కోసం.. ఆకలేయకపోతున్నా.. సరదాగా స్నేహితులతో కలిసి తింటున్నారా..? అయితే అనారోగ్య సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. సాధారణంగా ఆకలిగా లేనప్పుడు తినే తిండి అనారోగ్యం కలిగిస్తుందని వైద్యులు తెలిపారు. ఆహారం తీసుకున్నప్పుడు గ్లూకోజ్ స్థాయులను పరిశీలించడంతో ఈ విషయం వెల్లడి అయినట్లు తెలిసింది. ఆకలి లేనప్పుడు సరదాగా తినే తిండి అనారోగ్యం పాలు చేస్తుందని వైద్యులు చెప్తున్నారు.
 
అలాగే రోజుకు మూడు పూటలు మాత్రమే ఆహారం తీసుకోవాలి. అల్పాహారం, భోజనం, రాత్రిపూట తప్పనిసరిగా ఆహారం తీసుకోవాలి. అదీ ఆకలి కలిగినప్పుడే తీసుకోవాలి. అదీ ఇంటి భోజనానికే ప్రాధాన్యత ఇవ్వాలి. స్నాక్స్‌గా కుకీస్, క్యాండీబార్స్, ఐస్ క్రీమ్స్, చిప్స్ తీసుకోకూడదు. ఆహారం తీసుకున్న తర్వాత 10 నుంచి 15 నిమిషాలు అలా కలియతిరగాలి. 
 
సాయంత్రం పూట స్నేహితులతో సరదాగా మాట్లాడాలి. అప్పుడప్పుడు సంగీతం వినడం, ఆడుకోవడం, పిల్లలతో గడపడం ద్వారా అనారోగ్య సమస్యలు తలెత్తవు. అలాగే ఉద్వేగానికి లోనైనప్పుడు ఆహారం తీసుకోకూడదు. కోపంగా వుంటే పది నిమిషాల తర్వాత కోపాన్ని నియంత్రిచుకున్నాకే ఆహారం తీసుకోవాలి. అలాకాకుండా ఒత్తిడిలో అధిక ఆహారం తీసుకోవడం ద్వారా బరువు పెరిగిపోతుందని వైద్యులు సూచిస్తున్నారు.