బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : ఆదివారం, 18 నవంబరు 2018 (11:14 IST)

సాఫ్ట్ డ్రింక్స్‌తో సంతానలేమి... రుతుక్రమ సమస్యలు

మార్కెట్‌లో లభ్యమయ్యే శీతల పానీయాల్లో కొన్ని అనారోగ్యానికి కారణమవుతున్నాయి. పలు కంపెనీలు తయారు చేస్తున్న శీతల పానీయాల్లో హానికారక రసాయన పదార్థాలు (లెడ్, సీసం) ఉన్నట్టు పలు పరిశోధనలు నిర్ధాయించాయి. 
 
ఒక దశలో పునరుత్పత్తి వ్యవస్థనే నిర్జీవంగా మార్చేస్తున్నాయి. ప్రత్యేకించి సోడాలు, ఇతర శీతల పానీయాలు (సాఫ్ట్ డ్రింక్స్) కొన్ని సేవించడం వల్ల స్త్రీ పురుషుల్లోనూ సంతాన లేమి సమస్యలను ఉత్పన్నం చేస్తున్నట్టు తేలింది. 
 
శీతలపానీయాల్లోనూ రుచికోసం కృత్రిమ తీపిని కలిగించే ఆస్పరేటమ్ అనే పదార్థం కనపడుతుంది. ఇది ఎండోక్రైన్ గ్రంథుల మీద దుష్ప్రభావాన్ని చూపుతుంది. ఫలితంగా హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి ఇది కూడా సంతానోత్పత్తి సమస్యలకు కారణమవుతుంది. 
 
సోడాలు, శీతలపానీయాలను అతిగా సేవించే స్త్రీలలో అండాశయ సమస్యలు ఏర్పడటంతో పాటు పీఎంఎస్ (ప్రీ మెన్‌స్టురల్ సింటమ్స్)లో హెచ్చుతగ్గులు ఏర్పడతాయి. ఈ ఆస్పరేటమ్ వల్ల సంతానోత్పత్తి సమస్యలతో పాటు గర్భస్రావాలు, గర్భస్థ శిశు వైకల్యాలు ఏర్పడే ప్రమాదం కూడా ఉంది. 
 
ఎక్కువ తీయగా ఉండే శీతలపానీయాలు తాగినా, వ్యాధి నిరోధకశక్తి క్షీణిస్తుంది. సంతానోత్పత్తికి అతి ముఖ్యమైన అంశాలు శరీరంలో తగ్గిపోతాయి. హార్మోన్ల అసమతుల్యతతో పాటు ఊబకాయం వచ్చే అవకాశం ఉంది. శీతల పానీయాలు ఎక్కువగా తాగే పురుషుల్లో వీర్యకణాలు సంఖ్య, జీవత్వం, వాటి చలనశక్తి తగ్గే అవకాశం ఉంది. సోడాల్లో ఆమ్లాలు మరీ ఎక్కువగా ఉంటాయి. వీటిల్ల హీహెచ్ శాతం మారిపోతూ ఉంటుంది. పీహెచ్ ఎక్కువైతే పోషకాలు నిలవవు. దీనివల్ల వీర్య కణాల ఆకారం మారడం, నాణ్యత లోపించడం లేదా వీర్యకణాలు చనిపోవడం జరగవచ్చు. 
 
అంతేకాకుండా, శీతలపానీయాల్లో ఎక్కువగా కెఫిన్ కలుపుతారు. ఫ్రక్టోస్ కూడా ఉంటుంది. స్త్రీలలో వీటవల్ల అండాశయ సమస్యలు సంతానోత్పత్తి సమస్యలు ఎక్కువవుతాయి. కెఫిన్ కారణంగా రక్తనాణాలు ముడుచుకపోవడంతో గర్భాశయంలోకి రక్తప్రసరణ తగ్గిపోతుంది. దీనివల్ల రుతుక్రమం దెబ్బతింటుంది. కెఫిన్, ఆస్పరటేమ్, ప్రక్టోస్ ఈ మూడింటినీ కలిపి సేవించడం వల్ల సెక్స్ హార్మోన్లు, హార్మోన్ గ్రాహకాలపై దుష్ప్రభావం పడటంతో వంధ్యత్వం కలుగుతుంది. అందుకే సంతానం కోరుకునే స్త్రీ పురుషులు ఇరువురూ సోడా, శీతలపానీయాలకు దూరంగా ఉండటం ఎంతోమేలు.