శుక్రవారం, 29 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 21 అక్టోబరు 2023 (14:57 IST)

కొవ్వు కరిగించే వాటర్ ఫాస్టింగ్, ఎలా చేయాలి?

drinking water
ఈ రోజుల్లో శరీరంలో కొవ్వు పేరుకుపోయి ఇబ్బందిపడేవారి సంఖ్య పెరిగిపోతుంది. అలాంటి వారు వాటర్ ఫాస్టింగ్ చేస్తే కొవ్వు కరిగించుకోవచ్చని నిపుణులు చెపుతారు. ఐతే దాన్ని ఎలా చేయాలో తెలుసుకుందాము. వాటర్ ఫాస్టింగ్ అనేది ఒక రకమైన ఉపవాసం, దీనిలో నీరు మాత్రమే త్రాగడానికి అనుమతించబడుతుంది. ఈ రకమైన ఉపవాసంలో సదరు వ్యక్తి ఘన ఆహారానికి దూరంగా ఉండాలి. కొవ్వును కరిగించుకునేందుకు నీటి ఉపవాసం మంచి మార్గమని పరిశోధకులు నివేదించారు.
 
 నీటి ఉపవాసం 24 నుంచి 72 గంటలు ఉంటుంది. అయితే, దీనికి ఎటువంటి కాలపరిమితిని నిర్ణయించలేదు. అధ్యయనం ప్రకారం, ఈ ఉపవాసం మధుమేహం, క్యాన్సర్, గుండె, బీపీ, నరాల సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఉపవాస స్థితిలో, ఏ ఆహారాన్ని తీసుకోని తర్వాత శరీరంలో కార్బోహైడ్రేట్ల పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. దాంతో శక్తి కోసం శరీరం ఘనీభవించిన కొవ్వును ఉపయోగిస్తుంది. దీని వల్ల కొవ్వు పూర్తిగా తగ్గిపోతుంది.
 
ఈ ఉపవాసం చేయడానికి ముందు ఖచ్చితంగా నిపుణుడిని సంప్రదించాలి. దీన్ని ప్రారంభించబోతున్నట్లయితే, 2 నుండి 3 రోజులు తక్కువగా తినాలి. అధ్యయనం ప్రకారం, వాటర్ ఫాస్టింగ్ సరిగ్గా చేస్తే, ప్రతిరోజూ 0.9 కిలోల బరువు తగ్గవచ్చు.