మంగళవారం, 26 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 2 జనవరి 2020 (11:56 IST)

పాలకూర జ్యూస్‌ తాగితే బరువు తగ్గుతారు.. తెలుసా?

అవును.. పాలకూర జ్యూస్ తాగితే సులభంగా బరువు తగ్గుతారని ఆయుర్వేద నిపుణులు  సూచిస్తున్నారు. ఇందులో విటమిన్‌ బి ఎక్కువ. ఇది మన జీవక్రియను సహజసిద్ధంగా చురుకుగా ఉండేలా చేస్తుంది. పాలకూరలోని ఐరన్‌, మన కండరాలకు ఆక్సిజన్‌ చక్కగా సరఫరా అయ్యేలా చేస్తుంది. అందువల్ల కండరాలు తమ చుట్టూ పేరుకున్న కొవ్వును కరిగించేస్తాయి. 
 
పాలకూరను రోజువారీ వంటల్లో చేర్చుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని వైద్యులు చెప్తున్నారు. ముఖ్యంలో శరీరంలో జీవక్రియ మెరుగయ్యేలా చెయ్యాలంటే, పాలకూరను జ్యూస్‌లా చేసుకుని తాగడం సరైన మార్గమని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 
 
పాలకూరను క్రమంగా తీసుకుంటే మతిమరుపును దూరం చేసుకోవచ్చు. పాలకూరలో లభించే విటమిన్ సీ, ఏలు, మెగ్నీషియం, ఫోలిక్ యాసిడ్లు క్యాన్సర్‌ను నివారిస్తాయి. పాలకూరను తీసుకోవడం ద్వారా లైంగిక సమస్యలు దరిచేరవు. పాలకూరలో విటమిన్ ఎ, బీటా కెరాటిన్‌లు వయస్సు ఛాయలు రానీయకుండా చర్మాన్ని కాపాడుతాయి. అందుకే రోజూ పాలకూరను ఆహారంలో భాగం చేసుకుంటే చర్మం మెరిసిపోతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.