శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : మంగళవారం, 13 జూన్ 2017 (14:14 IST)

ఊబకాయాన్ని దూరం చేసుకోవాలంటే.. ఓట్స్, బాదం, పిస్తా తీసుకోండి.

ఓట్స్, బాదం, పిస్తా వంటి నట్స్‌తో ఊబకాయాన్ని దూరం చేసుకోవచ్చు. కొలెస్ట్రాల్‌ను కరిగించాలంటే.. అధికంగా పీచు కలిగివుండే సోయాను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా బరువును నియంత్రించవచ్చును. సోయా మిల్క్, పచ్చి బఠ

ఓట్స్, బాదం, పిస్తా వంటి నట్స్‌తో ఊబకాయాన్ని దూరం చేసుకోవచ్చు. కొలెస్ట్రాల్‌ను కరిగించాలంటే.. అధికంగా పీచు కలిగివుండే సోయాను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా బరువును నియంత్రించవచ్చును. సోయా మిల్క్, పచ్చి బఠాణీలను ఆహారంలో చేర్చుకోవాలి. అలాగే ఉసిరిలోని గింజల్ని తీసేసి.. ఆ రసంలో కాస్త అల్లం రసాన్ని రోజూ ఉదయం తాగితే కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. ఇంకా గోరువెచ్చని నీటిలో ఒక టీ స్పూన్ కలుపుకుని తాగితే బరువు తగ్గుతుంది.
 
అదేవిధంగా బాదం పౌడర్‌లో కాసింత తేనె కలుపుకుని ఉదయం అల్పాహారానికి తర్వాత తీసుకుంటే బరువు తగ్గుతారు. క్యారెట్‌తో పాటు తేనె కలుపుకుని తీసుకుంటే కొలెస్ట్రాల్ తగ్గుతుంది. వీటితో పాటు అనాస, నిమ్మ, జామ, పుచ్చకాయ, కరివేపాకు రసాలను తీసుకోవడం ద్వారా శరీర బరువును తగ్గించుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.