బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 17 ఏప్రియల్ 2021 (19:15 IST)

పండ్లలో రారాజు అనాస, అధికంగా తింటే ఏమవుతుందో తెలుసా?

అనాస లేదా పైనాపిల్ ఆరోగ్యానికి చేసే మంచి చాలా వుంది. ఐతే అది మితిమీరి తీసుకుంటే మాత్రం అనారోగ్య సమస్యలు తలెత్తే ఆస్కారం లేకపోలేదు. అనాస పండ్లు సురక్షితం అయినప్పటికీ వీటిని అధికంగా తీసుకోవడం వల్ల రక్తం పలచబడటానికి కారణం కావచ్చు. ఎంజైమ్ బ్రోమెలైన్ ఉండటం దీనికి కారణం. కాబట్టి అనాసను మోతాదుకి మించి తినకూడదు. 
 
అలాగే దీనిని అధికంగా తీసుకోవడం వల్ల అందులో వున్న బ్రోమెలైన్ కారణంగా ఉబ్బసం సమస్య తలెత్తే అవకాశం వుంది. తల్లిపాలు ఇచ్చేవారు అనాస పండుకి దూరంగా వుండటం మంచిదని వైద్య నిపుణులు చెపుతున్నారు.
 
అనాస రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది. కాబట్టి యాంటీ డయాబెటిక్ ఔషధాలతో పాటు అనాస లేదా దాని సప్లిమెంట్లను తీసుకునేటప్పుడు రక్తంలో గ్లూకోజ్ స్థాయిని పర్యవేక్షించడం మంచిది.
 
ఇంకా అనాస పండు వల్ల కలిగే ఇతర ప్రతికూలత ఫలితాలు ఏమిటంటే.. కడుపులో గడబిడగా వుండటం. విరేచనాలు, గొంతులో వాపు, రుతు సమస్యలు, వికారంగా వుండటం వంటివి కూడా తలెత్తవచ్చు.