సోమవారం, 2 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By జె
Last Modified: శుక్రవారం, 13 మార్చి 2020 (20:03 IST)

ఆడవారి ముక్కు చాలా చురుకు.. ఎలా?

మనిషికీ, మనిషికీ వాసన పసిగట్టడంలో కొంత తేడా ఉండొచ్చు. కానీ మగవారికంటే ఆడవారి ముక్కులే మహా చురుగ్గా పనిచేస్తాయంటున్నారు శాస్త్రవేత్తలు. మగవారితో పోలిస్తే ఆడవారి ముక్కు చురుగ్గా పనిచేస్తుందేమో అన్నది మొదటి నుంచి ఉన్న అనుమానమే.
 
కానీ ఎవరు ఎంత ప్రయత్నించినా ఆ వాదనకు రుజువు కనుక్కోలేకపోయారట. అయితే బ్రెజిల్‌కి చెందిన శాస్త్రవేత్తలు ఐసోట్రోపిక్ ఫ్రాట్టినేటర్స్ అనే పరీక్ష ద్వారా దీన్ని నిరూపించారట. ఈ పరీక్షతో మెదడులో ఏ భాగానికి సంబంధించి ఎన్ని కణాలు ఉన్నాయో ఖచ్చితంగా లెక్కకట్టవచ్చునట. 
 
ఐసోట్రోపిక్ ఫ్రాట్టినేటర్స్ ఉపయోగించి కొందరిని పరీక్షించారు. వాసనకి సంబంధించి న్యూరాన్లు ఆడవారిలో 50శాతం ఎక్కువగా ఉన్నట్లు ఈ పరీక్షలో తేలిందట. బహుశా ఆడవాళ్ళకి పుట్టుకతోనే వాసనకి సంబంధించి ఎక్కువ కణాలు ఉండి ఉంటాయని భావిస్తున్నారు.
 
మనకి తెలియకుండానే ముక్కు చాలా విషయాల్ని తెలియజేస్తుంటుంది. బయట వర్షం పడుతున్నా ఎక్కడన్నా మంటలు చెలరేగుతున్నా.. కొన్ని వాసనలు వస్తుంటాయి. వాటిని స్త్రీల ముక్కులు వెంటనే పసిగట్టేస్తాయంటున్నారు పరిశోధకులు.