దానిమ్మ గింజలను మెత్తగా పేస్టు చేసి ఉలవల సూప్‌తో కలిపి తీసుకుంటే?

సిహెచ్| Last Modified శనివారం, 29 ఫిబ్రవరి 2020 (22:22 IST)
తొక్కలను పొడిచేసి, ఉదయాన్నే ఒక గ్లాసు నీటిలో ఒక టీ స్పూన్ పొడి కలిపి తీసుకుంటే రక్తశుద్ధి జరుగుతుంది.

దానిమ్మ గింజలను మెత్తగా పేస్టు చేసి ఉలవల సూప్‌తో కలిపి తీసుకుంటే మూత్రపిండాల్లో ఏర్పడిన రాళ్లు కరుగుతాయి. ఒక కప్పు సూప్‌కు రెండు స్పూన్ల ఉలవలు తీసుకోవాలి. దీనిలో కలపడానికి ఒక టేబుల్ స్పూన్ దానిమ్మ గింజలు తీసుకోవాలి.

దానిమ్మ తీపి, వగరు ఎలా ఉన్నా అందులోని ఔషధ గుణాలు మారవు. కాబట్టి దేనినైనా వాడవచ్చు.

దాల్చిన చెక్కని వేసి కాచిన నీటిని తాగుతుంటే వాంతులు తగ్గుతాయి.

దేహంలో కొలెస్ట్రాల్‌లో అసమతుల్యత రాకుండా నియంత్రిస్తుంది.

దోమకాటు వల్ల ఏర్పడిన దద్దుర్లు పోవాలంటే వాటి మీద ఉల్లిపాయ ముక్కతో రుద్దాలి.

ధనియాలను నీళ్ళలో నానవేసి ఆ నీటిని తరచుగా తాగుతుంటే వాంతులు తగ్గుతాయి.

నాలుగైదు బాదం పప్పులను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే తింటే మెదడు వికాసం పొందుతుంది.దీనిపై మరింత చదవండి :