బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 18 డిశెంబరు 2021 (17:03 IST)

పాకిస్థాన్‌లో భారీ పేలుడు - 10 మంది మృత్యువాత

దాయాది దేశమైన పాకిస్థాన్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పది మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఆ దేశ ఓడ రేవుపట్టణంగా గుర్తింపు పొందిన కరాచీ నగరంలో నిత్యం రద్దీగా ఉండే షేర్షా పరాచా చౌక్‌లోని ఓ భవనంలో ఈ పేలుడు సంభవించింది. ఈ భారీ పేలుళ్ళలో 10 మంది వరకు చనిపోయినట్టు ఆ దేశ అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని వారు వెల్లడించారు. 
 
ఈ భారీ పేలుడు ధాటికి సమీపంలోని పలు భవనాలు ధ్వంసమయ్యాయి. పెద్ద సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. పేలుడు జరిగిన ప్రాంతంలో సహాయక చర్యలు ముమ్మరంగా 
సాగుతున్నాయి. 
 
పేలుడు జరిగిన ప్రాంతంలో ఓ బ్యాంకు కూడా ఉన్నట్టు సమాచారం. ప్రాథమిక దర్యాప్తు చేపట్టిన పోలీసులు... గ్యాస్ లీక్ కావడం వల్లే ఈ పేలుడు సంభవినట్టు తెలుస్తుందని తెలిపారు. అయితే, పేలుడు భారీ స్థాయిలో ఉండటంతో ఏదేని ఉగ్ర సంస్థకు చెందిన వారు ఈ పనికి పాల్పడివుంటారని భావిస్తున్నారు.