60 ఏళ్ల ఐఐటీ మద్రాస్‌ చరిత్రలో తొలి మహిళ

iit women
ఎం|
ఐఐటీ మద్రాసులో 21 ఏళ్ల తమిళనాడు యువతి చరిత్ర సృష్టించారు. ప్రధాని మోదీ సమక్షంలో జరిగిన 56వ స్నాతకోత్సవంలో విద్యార్థిని కవితా గోపాల్‌ ‘రాష్ట్రపతి’ బంగారు పతకం అందుకొన్నారు. 60 ఏళ్ల ఐఐటీ మద్రాస్‌ చరిత్రలో ఈ పతకాన్ని గెలుచుకొన్న మొట్టమొదటి మహిళ ఆమెనే.

ఈ పతకంతో పాటు కవితా గోపాల్‌ మరో రెండు అవార్డులను సొంతం చేసుకొన్నారు. బీటెక్‌ సీఎస్‌ఈలో అత్యధిక సీజీపీఏ 9.95తో ఎం.విశ్వేశ్వరయ్య స్మారక పురస్కారం, బి.రవిచ్రందన్‌ స్మారక పురస్కారం కూడా కవిత అందుకొన్నారు.

కాంచీపురం జిల్లా అణుపురంలోని అటామిక్‌ ఎనర్జీ సెంట్రల్‌ స్కూలు, కల్పాకంలోని కేవీవీలో చదివిన కవిత 2015లో ఐఐటీ మద్రాసులో కంప్యూటర్‌ సైన్స్‌లో చేరారు. ప్రస్తుతం గూగుల్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. ఈ అవార్డులను పొందటం తనకు అమితానందాన్ని కలిగిస్తోందని కవితా గోపాల్‌ చెప్పారు.
దీనిపై మరింత చదవండి :