1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 15 నవంబరు 2023 (18:54 IST)

భర్త చేతిలో కాల్చివేతకు గురైన గర్భవతి.. మహిళ పరిస్థితి విషమం

భర్త కాల్చివేతకు గురై గర్భవతి అయిన మలయాళీ మహిళ పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన అమెరికాలోని చికాగోలో చోటుచేసుకుంది. ఉజ్వూరు హిల్ స్టేషన్‌లో అబ్రహం, లాలీ దంపతుల కుమార్తె మీరా (32)పై కాల్పులు జరిగాయి. మీరా గర్భవతి. తీవ్ర గాయాలపాలైన వారిని ఆస్పత్రిలో చేర్పించారు. కుటుంబ సమస్యల కారణంగానే భర్త కాల్పులు జరిపినట్లు సమాచారం. 
 
అమల్ రేగి, మీరా చాలా కాలంగా అమెరికాలో ఉన్నారు. మీరా భర్త ఏటుమనూరు పాశాయంపల్లికి చెందిన అమల్ రేగి. అమల్‌ను చికాగో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అమల్ రెజీ మొబైల్ ఫోన్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.