మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 13 జనవరి 2018 (11:12 IST)

ఎయిర్‌టెల్ వినియోగదారులకు కొత్త ఆఫర్.. అమేజాన్ ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్ ఫ్రీ

ప్రముఖ టెలికాం రంగ సంస్థ ఎయిర్‌టెల్ తన పోస్ట్ పెయిడ్ వినియోగదారులకు సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. రూ.499తో పాటు ఆపై ప్లాన్లను కలిగివున్న కస్టమర్లకు ఏడాదిపాటు అమేజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా

ప్రముఖ టెలికాం రంగ సంస్థ ఎయిర్‌టెల్ తన పోస్ట్ పెయిడ్ వినియోగదారులకు సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. రూ.499తో పాటు ఆపై ప్లాన్లను కలిగివున్న కస్టమర్లకు ఏడాదిపాటు అమేజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందించనున్నట్లు ప్రకటించింది. 
 
పాత, కొత్త వినియోగదారులకు ఇది వర్తిస్తుందని తెలిపింది. ఈ ప్లాన్‌లో ఉన్న వినియోగదారులు ఏడాదిపాటు రూ.999 విలువైన అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌ను పొందవచ్చునని సంస్థ ఓ ప్రకటనలో వెల్లడించింది. అమేజాన్ డాట్ ఇన్‌లో ప్రత్యేక రాయితీలు, డీల్స్‌ను కూడా పొందవచ్చునని వివరించింది. 
 
ఆఫర్లో భాగంగా అమేజాన్ ప్రైమ్ వీడియోలను అపరిమితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎయిర్‌టెల్ వి-ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ వినియోగదారులు కూడా ఆ ఆఫర్‌ను పొందవచ్చని ఎయిర్‌టెల్ తెలిపింది. ఎయిర్‌టెల్ పోస్టు పెయిడ్ ఖాతాదారులు ఈ అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌కోసం తొలుత గూగుల్ ప్లే  స్టోర్ నుంచి ఎయిర్‌టెల్ టీవీని డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.