1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 29 సెప్టెంబరు 2021 (22:04 IST)

బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్ల కోసం.. పబ్జీ లైట్ తరహాలో బీజీఎమ్‌ఐ లైట్‌ గేమ్‌

పబ్ జీ స్థానంలో ఈ ఏడాది జూలై 2 నుంచి బీజీఎమ్‌ఐను క్రాఫ్టన్‌ తీసుకువచ్చింది. ఈ గేమ్‌ను అత్యధిక సంఖ్యలో యూజర్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. బీజీఎమ్‌ఐ లాంటి గేమ్స్‌ హై ఎండ్‌ ర్యామ్‌ ఉన్న ప్లాగ్‌ షిప్‌ ఫోన్లలో సులువుగా పనిచేస్తుంది. ర్యామ్‌ తక్కువగా ఉన్న బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్లలో బీజీఎమ్‌ఐ అంతగా సపోర్ట్‌ చేయదు. తరుచూ ఫోన్‌ హ్యగ్‌ అవుతోంది. 
 
ఈ నేపథ్యంలో బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్లను దృష్టిలో ఉంచుకొని పబ్జీ లైట్‌ తరహాలోనే బీజీఎమ్‌ఐ లైట్‌ గేమ్‌ను త్వరలోనే తీసుకురావాలని క్రాఫ్టన్‌ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. బీజీఎమ్‌ఐ లైట్‌ వర్షన్‌తో అధిక సంఖ్యలో యూజర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నాలను ముమ్మురం చేస్తోంది. కాగా లైట్‌ వెర్షన్‌ ఎప్పుడు వస్తుందనే విషయం ఇంకా తెలియలేదు.
 
ఇటీవల, అనేక వెబ్‌సైట్‌లు BGMI లైట్ విడుదలకు సిద్ధంగా ఉన్నట్లు నివేదించాయి. అయితే, గేమ్ యొక్క తేలికైన వెర్షన్ గురించి క్రాఫ్టన్ ఏమీ వెల్లడించలేదు. గూగుల్ ప్లే స్టోర్ ప్రకారం, బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా ఆడటానికి గేమర్స్ ఆండ్రాయిడ్ 5.1.1 లేదా కనీసం 2 జిబి ర్యామ్ కలిగి ఉండాలి. అందువల్ల, BGMI లైట్ వెర్షన్ విడుదల చేయబడితే, అది తక్కువ పవర్ ఉన్న ఫోన్‌ల కోసం ఉంటుందని టాక్.