సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 27 డిశెంబరు 2022 (13:39 IST)

ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమైన గూగుల్

Google
2023 సంవత్సరానికి మరో నాలుగు రోజులు మాత్రమే మిగిలివుంది. అయితే, ఈ సంవత్సరంలో ఉద్యోగులకు టెక్ సెర్చింజన్ గూగుల్ తేరుకోలేని విధంగా షాకివ్వనుంది. పనితీరు ఏమాత్రం ఆశాజనకంగా లేని ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. ఇలాంటి వారిలో దాదాపు పది వేల మంది వరకు ఉన్నారు. తన ఉద్యోగుల్లో ఆరు శాతం మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. పనితీరు బాగోలేదనే పేరుతో వీరిని తొలగించనుంది ఇందుకోసం ముందుగానే గూగుల్ కొత్త పనితీరు విధానాన్ని అమల్లోకి తీసుకునిరానుంది. 
 
దీని ప్రకారం ఉద్యోగుల పనితీరును మదింపు వేసి ఆ జాబితా ఆధారంగా ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. దాదాపు పది వేల మందిని తొలగించేందుకు సమాయత్తమవుతుంది. తక్కువ పనితీరు, తక్కువ ఉత్పాదకత, మంచి ఫలితాలు చూపించలేకపోవడం వంటి విభాగాలకు చెందిన వారిని తొలగించేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. 
 
ఇదే అంశంపై గూగుల్ గత వారం ఓ సర్వే కూడా చేసినట్టు సమాచారం. నిజానికి ఉద్యోగుల గూగుల్ సంస్థ ఉద్యోగుల తొలగింపు విషయంలో గత కొంతకాలంగా జోరుగానే ప్రచారం సాగుతోంది. అయితే, ఎక్కడా కూడా అధికారికంగా వెల్లడించలేదు. కానీ, ఇపుడు పనితీరు ఆధారంగా తొలగించేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. కాగా, ఈ-కామర్స్ దిగ్గజాలైన అమెజాన్, ఫ్లిప్‌కాట్‌తో పాటు ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సంస్థలు ఇప్పటికే ఉద్యోగులను తొలగించిన విషయం తెల్సిందే.