గురువారం, 29 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 6 అక్టోబరు 2022 (15:11 IST)

4 నగరాల్లో 5జీ బీటా నెట్‌వర్క్‌.. వారికి ఫ్రీనే..

5G technology
దసరా పర్వదినం అక్టోబర్ ఐదో తేదీన దేశంలోని నాలుగు నగరాల్లో 5జీ బీటా సర్వీస్‌లను రిలయన్స్ జియో లాంచ్ చేసింది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, వారణాసి నగరాల్లో 5జీని అందుబాటులోకి తెచ్చింది. ఈ సందర్భంగా వెల్‌కమ్ ఆఫర్‌ను కూడా జియో ప్రకటించింది. 
 
ఆరేళ్ల క్రితం 4జీ లాంచ్ తొలినాళ్లలో ఆన్‌లిమిటెడ్ డేటా, కాల్స్‌ను ఇచ్చిన జియో.. ఇప్పుడు 5జీ విషయంలోనూ అదే ఫార్ములాను ఫాలో అవుతోంది. ప్రస్తుతానికి 4 నగరాల్లో 5జీ బీటా నెట్‌వర్క్‌ను జియో లాంచ్ చేసింది. ఈ ఆఫర్‌ను అందుబాటులోకి తెచ్చింది.
 
జియో 5జీ లాంచ్, వెల్‌కమ్ ఆఫర్‌ గురించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఈ ప్లాన్ ద్వారా ఉచితంగా అన్‌లిమిటెడ్ డేటాను వాడుకోవచ్చు. 5జీ ప్లాన్‌లను ప్రకటించే వరకు ఈ వెల్‌కమ్ ప్లాన్‌ అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఏకంగా 1జీబీపీఎస్ వరకు వేగం ఉంటుందని జియో ప్రకటించింది.