బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By మోహన్
Last Updated : శుక్రవారం, 22 ఫిబ్రవరి 2019 (18:35 IST)

ఒకేసారి పది మందితో కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడుకోవచ్చు.. ఎలా?

ఆండ్రాయిడ్ యూజర్ల కోసం రిలయన్స్ జియో మరో కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొస్తోంది. గ్రూప్ టాక్ లేదా గ్రూప్ కాలింగ్ అవకాశాన్ని కల్పించనుంది. ఇందుకోసం ఒక కొత్త అప్లికేషన్‌ని అందించనుంది.


ఇది గూగుల్ ప్లే స్టోర్‌లో లభిస్తుంది. జియో సిమ్ వాడుతున్న ఆండ్రాయిడ్ వినియోగదారులు ఒకేసారి పది మందితో కాన్ఫరెన్స్ కాల్ (ఆడియో మాత్రమే) ద్వారా మాట్లాడుకోవచ్చు. 
 
లెక్చర్ మోడ్, మ్యూట్ పార్టిసిపెంట్ వంటి ఇతర ఫీచర్లను కూడా ఇందులో జోడించింది. ప్రస్తుతం పరీక్ష దశలో ఉన్న ఈ యాప్‌ని అతి త్వరలో జియో వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానుంది.