సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 15 మార్చి 2023 (15:55 IST)

ఓపెన్ AI ChatGPT GPT-4 కొత్త వెర్షన్‌ గురించి తెలుసా?

ChatGPT GPT-4
ChatGPT GPT-4
చాట్‌జిపిటిని సృష్టించిన ఓపెన్‌ఎఐ, జిపిటి-4 మోడల్ మునుపటి కంటే ఇప్పుడు మరింత సృజనాత్మకంగా మారింది.  ఇది మునుపటి వెర్షన్ కంటే ఎక్కువ కచ్చితత్వంతో క్లిష్ట సమస్యలను పరిష్కరించగలదని ఓపెన్ ఐ తెలిపింది.  
 
GPT-4 ఇప్పుడు పాటను కంపోజ్ చేయడం, స్క్రీన్‌ప్లే రాయడం లేదా యూజర్‌లతో ఎవరి రచనా శైలిని నేర్చుకోవడం వంటి సృజనాత్మక, సాంకేతిక రచన పనులను రూపొందించగలదు.. సవరించగలదు. అధునాతన తార్కిక సామర్థ్యంలో GPT-4 ChatGPTని అధిగమించింది. ChatGPT-4 చిత్రాలు, రేఖాచిత్రాలు, స్క్రీన్‌షాట్‌లను చదవగలదు.
 
GPT-4 గురించి మాట్లాడుతూ.. OpenAI CEO సామ్ ఆల్ట్‌మాన్ ఈ మోడల్‌లో ఇప్పటికీ కొన్ని లోపాలు, పరిమితులు ఉన్నాయి. మోడల్‌లో అవసరమైన లోపాలను మెరుగుపరచడం కోసం వినియోగదారులు GPT-4 కోసం అభిప్రాయాన్ని తెలియజేయడానికి అనుమతించబడతారు.
 
GPT-4 మునుపటి కంటే సురక్షితమైన, మరింత ఉపయోగకరమైన ప్రతిస్పందనలను అందిస్తుందని ChatGPT సృష్టికర్త సామ్ ఆల్ట్‌మాన్ తెలిపారు. జీపీటీ-4 నిర్మాణంలో 6 నెలలుగా నిరంతరం శ్రమిస్తున్నామని తెలిపారు. GPT-4 82 శాతం అనధికార కంటెంట్ అభ్యర్థనలకు ప్రతిస్పందిస్తుంది.