శుక్రవారం, 6 ఫిబ్రవరి 2026
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. కథనాలు
Written By CVR
Last Updated : శుక్రవారం, 20 ఫిబ్రవరి 2015 (16:13 IST)

పెంపుడు జంతువులు ఉన్నాయా... పిల్లలు జాగ్రత్త..!

ఈ రోజుల్లో ఇళ్లలో కుక్కలు, పిల్లులు వంటి పెంపుడు జంతువులను పెంచడం సాధారం. కొందరు హోదా కోసం జంతువులను పెంచుతుంటారు.  వాటిపై వల్లమారిన ప్రేమను చూపడమై కాకుండా రాత్రులలో సైతం పక్కలోనే పడుకోబెట్టుకుంటారు. మరికొందరు ఎలుకలు, కుందేళ్లను కూడా ఇళ్లలో పెంచుతుంటారు. అయితే వాటి నుంచి తీసుకోవాల్సి రక్షణను మాత్రం తీసుకోవడం మరచిపోతారు.
 
పెంపుడు జంతువులను పెంచడం వలన మానశిక ఉల్లాసం కలగడం వాస్తవమే అయినప్పటికీ, వాటి వలన పిల్లలకు అనారోగ్యం ఏర్పడే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పెంపుడు జంతువులను ముట్టుకోవడం వలన కొన్ని సూక్ష్మక్రిమి సంబంధమైన జబ్బులు కలుగవచ్చునని తెలుపుతున్నారు. 
 
కుక్క, పిల్లి, ఎలుక, కుందేలు, ఉడత వంటి పెంపుడు తంజువుల వలన గుర్తించలేనటువంటి రోగం కలుగుతుందట. నోరు మంట, కడుపులో అప్పుడప్పుడు వికారం, పేగులు తిప్పినట్టు ఉండడం, మండటం వంటి ఆరోగ్య సమస్యలు పెంపుడు జంతువుల వలన ఏర్పడవచ్చని వైద్యులు వెల్లడిస్తున్నారు.
 
అయితే ఇటువంటి సమస్యలకు ఆస్పత్రికి వెళ్లాల్సిన పని లేదు. ఇంటిలోనే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరి. ముఖ్యంగా పిల్లలు ఉండే గది లోపలికి పెంపుడు జంతువులను అలవాటు చేయరాదు. పిల్లలు ఏమాత్రం కడుపులో నొప్పి, మంట అని చెప్పినా వెంటనే వెల్లుల్లి రసం తీసుకుని, నీటిలో కలిపి తాపించాలి. ఇలా రోజుకు రెండు సార్లుగా తగ్గేంత వరకూ తాగించాలి. ఒక కప్పు నీళ్ళలో రెండు గరిటెల తేనె తాపించాలి.  

ఈ విధంగా చేస్తే పెంపుడు జంతువుల నుంచి ఎదురయ్యే అనారోగ్య సమస్య నుంచి ఉపశమం పొందవచ్చునని వైద్యులు సూచిస్తున్నారు.