శనివారం, 23 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. మహాశివరాత్రి
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 17 ఫిబ్రవరి 2023 (22:09 IST)

మహాశివరాత్రి.. శివా, శివా అని పలికితే...? (video)

Lord Shiva
Lord Shiva
మహాశివరాత్రి పర్వదినాన శివుడిని పూజించడం ద్వారా సకల శుభాలు చేకూరుతాయి. శివరాత్రి అనే పదానికి శివుని రాత్రి అని అర్థం. శివరాత్రి 4 జామ పూజల్లో పాల్గొనే వారికి మోక్షం సిద్ధిస్తుంది. సూర్యుడు, కుమార స్వామి, మన్మథుడు, ఇంద్రుడు, యముడు, చంద్రుడు, కుబేరుడు, అగ్ని దేవుడు శివరాత్రి ఉపవాసం నుండి శివుని అనుగ్రహం పొందిన వారే. శివరాత్రి నాడు ఆలయాలను వెళ్లలేని వారు ఇంట్లోనే శివునికి అభిషేకం చేసి పూజించవచ్చు.
 
చీమలు, కొంగలు, పులులు, సాలెపురుగులు, ఏనుగులు, ఎలుకలు మొదలైనవి శివుని పూజించి మోక్షాన్ని పొందాయి. శివ అనే పదానికి మంగళకరమైనది అని అర్థం. కాబట్టి శివా, శివా... అని ఎంతగా శివరాత్రి రోజున జపిస్తే అంత ప్రయోజనం కలుగుతుంది. శివరాత్రి పర్వదినాన త్యాగరాజ నామంతో ఈశ్వరుడు కొలువైన శివాలయాలను దర్శించుకోవడం ద్వారా సర్వాభీష్టం సిద్ధిస్తుంది.