శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 14 సెప్టెంబరు 2020 (19:10 IST)

25 మంది ఎంపీలకు కరోనా పాజిటివ్... తెలుగువారు ఎంతమంది?

దేశాన్ని ఓ కుదుపుకుదుపుతున్న కరోనా వైరస్ ఎలాంటి తారతమ్యాలు చూపించడం లేదు. ఏమాత్రం నిర్లక్ష్యం లేదా అశ్రద్ధగా ఉంటే చాలు ఈ వైరస్ సోకుతోంది. అయితే, సోమవారం నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల కోసం ఎంపీలందరికీ కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో 17 మందికి ఈ వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. అందులో ఏపీకి చెందిన ఇద్దరు ఎంపీలు కూడా ఉన్నారు. 
 
దేశంలో కరోనా వైరస్ భయభ్రాంతులకు గుర్తిచేస్తున్న సమయంలో జరుగుతున్న ఈ సమావేశాల కోసం మునుపెన్నడూ లేనంతగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలోనే ఎంపీలందరికీ కరోనా వైద్య పరీక్షలు నిర్వహించగా 17 మందికి పాజిటివ్ వచ్చింది. వారిలో చిత్తూరు ఎంపీ ఎన్.రెడ్డెప్ప, అరకు ఎంపీ గొడ్డేటి మాధవి కూడా ఉన్నారు. 
 
కరోనా వైరస్ సోకిన వారిలో బీజేపీకి చెందిన 12 మంది ఎంపీలు ఉండగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు, శివసేన, డీఎంకే, ఆఎల్పీకి చెందిన ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. అలాగే, మొత్తం 785 మంది ఎంపీల్లో 200మందికి పైగా ఎంపీలు 65 యేళ్లు పైబడినవారే కావడం గమనార్హం. 
 
ఇకపోతే, కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన మిగిలిన ఎంపీల పేర్లను పరిశీలిస్తే, మీనాక్షి లేఖి, అనంత్ కుమార్ హెగ్డే, పర్వేశ్ సాహిబ్ సింగ్, సుఖ్ బీర్ సింగ్, హనుమాన్ బేణివాల్, సుకనాటా మజుందార్, ప్రతాప్ రావ్ జాదవ్, జనార్దన్ సింగ్, బిద్యుత్ బరణ్, ప్రదాన్ బారువా, జి. సెల్వమ్, ప్రతాప్ రావ్ పాటిల్, రామ్ శంకర్ కతేరియా, సత్యపాల్ సింగ్, రోద్మాల్ నాగర్‌లు ఉన్నారు.