సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By వి
Last Updated : సోమవారం, 14 సెప్టెంబరు 2020 (16:23 IST)

ప్రపంచవ్యాప్తంగా ఒక్కరోజులో 3 లక్షల కరోనా కేసులు: డబ్ల్యూహెచ్ఓ ఆందోళన

కరోనా మహమ్మారి అంతకంతకూ తీవ్రమవుతున్నది. అనేక దేశాలలో వైరస్ ప్రభావం మరింత విజృంభిస్తోంది. తాజాగా ఒక్కరోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల వ్యవధిలో 3, 07,930 కేసులు వచ్చాయి. ఇప్పటివరకు ఇదే రికార్డు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.
 
గతంలో ఒక్కరోజులో ఇన్ని కేసులు ఎప్పుడు రాలేదని వివరించింది. ముఖ్యంగా భారత్, అమెరికా, బ్రెజిల్ దేశాలలో కరోనా ముప్పు అధికంగా ఉంది. ఈ మూడు దేశాల్లో అత్యధిక సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. ఒక్క భారత్ లోనే రోజుకు 90 వేల వరకు పాజిటివ్ కేసులు వస్తుండటం తెలిసిందే.
 
ఇక కరోనా ప్రభావిత దేశాల్లో నిన్న ఒక్కరోజే 5,537 మరణాలు సంభవించగా ప్రపంచవ్యాప్తంగా కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 9,17,417కి చేరింది. అగ్రరాజ్యం అమెరికా కరోనా గణాంకాల పరంగా టాప్‌లో ఉంది. అమెరికాలో ఇప్పటివరకు 65,19,121 పాజిటివ్ కేసులు నమోదు కాగా 1, 94, 041 మంది మృత్యువాత పడ్డారు.
 
రెండోస్థానంలో ఉన్న భారత్‌లో ఇప్పటి వరకు 47, 54, 356 పాజిటివ్ కేసులు ఉండగా 78,586 మంది మరణించారు. బ్రెజిల్‌లో 43,30,455 పాజిటివ్ కేసులు ఉండగా 1,31,625 మరణాలు సంభవించాయి.