శుక్రవారం, 8 డిశెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 23 మార్చి 2023 (10:27 IST)

ఏప్రిల్ చివరి వారంతో 100 ఎపిసోడ్లు పూర్తి - భారీగా ప్లాన్ చేస్తున్న 'బిగ్‌ప్లాన్'

mann ki baat
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేపట్టిన 'మన్ కీ బాత్' కార్యక్రమం త్వరలోనే వంద ఎపిసోడ్లు పూర్తి చేసుకోనుంది. ఏప్రిల్ చివరి వారంతో 100 ఎపిసోడ్లు పూర్తి కానున్నాయి. గత 2014 అక్టోబరు మూడో తేదీన ఈ కార్యక్రమం ప్రారంభమైంది. అప్పటి నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ క్రమం తప్పకుండా పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలో వందో ఎపిసోడ్ కార్యక్రమాన్ని భారీగా ఎత్తున నిర్వహించాలని బీజేపీ శ్రేణులు నిర్ణయించాయి. ముఖ్యంగా, మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడే సమయంలో ప్రధాని మోడీ ప్రస్తావించిన పేర్లతో కూడిన వారిని ఎంపిక చేసి సన్మానించాలని భావిస్తున్నారు. 
 
అలాగే, దేశ వ్యాప్తంగా 100 ప్రాంతాలను ఎంపిక చేసి అక్కడ ఉన్న 100 మంది ప్రముఖులను ఆహ్వానించి మన్ కీ బాత్ వినిపిస్తారు. బీజేపీకి చెందిన 100 బూత్‌లలో ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వినిపించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 2014 అక్టోబరు మూడో తేదీన ప్రారంభమైన ఈ కార్యక్రమం వచ్చే నెల 30వ తేదీతో వంద ఎపిసోడ్లను పూర్తి చేసుకోనుంది. దీంతో ఈ వందో ఎపిసోడ్‌ను ప్రపంచ వ్యాప్తంగా వినిపించేలా బీజేపీ ప్లాన్ చేస్తుంది.