బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 22 మే 2023 (11:07 IST)

తాగునీటి కోసం నదివద్దకు వెళ్లిన బాలుడు.. మొసలి నోటికి ఎర

crocodile
కర్నాటక రాష్ట్రంలో ఓ విషాదకర ఘటన జరిగింది. తాగునీటి కోసం నది వద్దకు వెళ్లిన ఓ బాలుడు అదృశ్యమయ్యాడు. ఆ బాలుడిపై మొసలి దాడి చేసి నోట కరుచుకుని నదిలోకి వెళ్లిపోయింది. ఈ ఘటన కర్నాటక రాష్ట్రంలోని రాయచూరు తాలూకాలోని కృష్ణానదిలో జరిగింది. మృతుడిని ఈ తాలూకాలోని నడిగడ్డు గ్రామమైన కొర్వకులకు చెందిన బాలుడుగా గుర్తించారు.

నవీన్ (9) అనే బాలుడు ఆదివారం తన తల్లిదండ్రులతో కలిసి నదీ తీరంలో ఉన్న పొలం వద్దకెళ్లాడు. తాగునీటి కోసం మరో బాలుడితో కలిసి నదిలోకి వెళ్లి బాటిల్‌లో నీరు నింపుకొంటుండగా మొసలి.. నవీన్‌ను నోట కరచుకుని వెళ్లింది. ఈ భయానక దృశ్యాన్ని చూసిన మరో బాలుడు రోదిస్తూ విషయాన్ని పెద్దలకు చెప్పాడు.

గ్రామస్థులు నది వద్దకెళ్లి చూడగా నవీన్ జాడ కనిపించలేదు. సమాచారం అందుకున్న పోలీసులు.. అగ్నిమాపక సిబ్బందితో కలిసి బాలుడి ఆచూకీ కోసం గాలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. రాత్రి వరకు బాలుడి జాడ కానరాలేదు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.