సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

ఢిల్లీలో 10 రౌండ్ల కాల్పులు జరిపిన దుండగుడు - ఇద్దరికి గాయాలు

gunshoot
దేశ రాజధాని ఢిల్లీలో మరోమారు తుపాకీ కాల్పుల మోత మోగింది. వెస్ట్ ఢిల్లీలోని సుభాష్ నగరులో ఓ దుండగుడు 10 రౌండ్ల కాల్పులు జరిపాడు. ముందు వెళుతున్న కారులో ఉన్న వ్యక్తులపై విచ్చలవిడిగా ఫైరింగ్ చేశాడు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో జరిగిన కాల్పులతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. 
 
ఈ ఘటన అనంతరం ఆ ప్రాంతంలో భారీగా పోలీసులను మొహరించారు. సీసీటీవీ ఫుటేజీల్లో రికార్డైన్ దృశ్యాల ఆధారంగా ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కాల్పుల్లో గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినట్టు పోలీసులు వెల్లడించారు. గత నెల 16వ తేదీన నార్త్ వెస్ట్ ఢిల్లీలోని జహంగీర్‌పూరి ప్రాంతంలో జరిగిన ఘర్షణల తర్వాత వెస్ట్ ఢిల్లీలో కాల్పుల ఘటన జరగడం గమనార్హం.