ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 27 ఫిబ్రవరి 2022 (18:13 IST)

ముంగిస ఎంత పనిచేసిందంటే... బెంగాలీ నటిపై కేసు నమోదు

బెంగాలీ నటిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి కారణం ఓ ముంగిస. ఆ నటి పేరు స్రబంతి ఛటర్జీ. ఇపుడు నమోదైన కేసులో ఆమెకు జైలుశిక్ష పడినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అసలు ఆమెపై ఎందుకు కేసు నమోదు చేశారో పరిశీలిద్ధాం. 
 
ఇటీవల ఆమె గొలుసులతో కట్టేసివున్న ముంగిసతో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫోటోలు కాస్త వైరల్ అయ్యాయి. అంతే.. ఆమెపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదైంది. 
 
ముంగిసతో ఉన్న ఆమె ఫోటోలను చూసిన అటవీ శాఖ అధికారులు ఈ నెల 15వ తేదీన నోటీసులు పంపించారు. ఆ తర్వాత కేసు నమోదు చేశారు. కాగా, ఈ కేసులో నేరం రుజువైతే ఆమెకు ఏడేళ్ళ వరకు జైలుశిక్ష పడే అవకాశం ఉందని అటవీ శాఖ అధికారులు అంటున్నారు. దీనిపై ఆమె స్పందిస్తూ, ఈ కేసు విచారణలో ఉంది. అందువల్ల నో కామెంట్స్ అని వ్యాఖ్యానించారు.