సోమవారం, 22 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 25 అక్టోబరు 2022 (19:03 IST)

ఛత్తీస్‌ఘడ్ సీఎం భూపేష్‌కు కొరడా దెబ్బలు... ఎందుకని?

CM
CM
ఛత్తీస్‌ఘడ్ సీఎం భూపేష్ బఘెల్ కొరడా దెబ్బలు తిన్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్‌గఢ్, దుర్గ్ జిల్లాలోని గౌరి-గౌర పూజలో సీఎం పాల్గొన్నారు. అక్కడి గిరిజన సంప్రదాయంతో కొరడాతో కొట్టించుతున్నారు. చెడును తరిమి కట్టే దిశగా ఈ కొరడా దెబ్బలు కొట్టడం ఆనవాయితీ. 
 
దీపావళి మరుసటి రోజు ఈ పూజ నిర్వహిస్తుంటారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కొరడా దెబ్బలు కొట్టించుకున్నారు.. సీఎం. జనం సమక్షంలో సీఎం కొరడా దెబ్బలు తిన్నారు. సంప్రదాయానుసారం కొరడా దెబ్బలు కొట్టిన వ్యక్తి ఆ తర్వాత సీఎంకు అభివాదం చేశారు. ఈ గిరిజన సంప్రదాయాన్ని 'సోట' అని పిలుస్తారు. ఏళ్ల తరబడి ఈ సంప్రదాయం కొనసాగుతోంది.