శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 13 సెప్టెంబరు 2020 (13:17 IST)

దేశంలో కరోనా వైరస్ విజృంభణ.. 24 గంటల్లో 1114 మంది మృతి

దేశంలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. గత 24గంటల్లో కొత్తగా 94వేల 372 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 47లక్షల 54వేల 356కి చేరింది. అలాగే... 24 గంటల్లో 1114 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 78వేల 586కి పెరిగింది. దేశంలో మరణాల రేటు 1.7శాతంగా ఉంది. ప్రపంచ దేశాల్లో అది 3.19 శాతంగా ఉంది.
 
దేశంలో గత 24 గంటల్లో కరోనా నుంచి 78వేల 399 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీ కేసుల సంఖ్య 37లక్షల 2వేల 595కి పెరిగింది. దేశంలో రికవరీ రేటు 77.9 శాతంగా ఉంది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 9లక్షల 73వేల 175గా ఉంది. దేశంలో గత 24 గంటల్లో 10లక్షల 71వేల 702 శాంపిల్ టెస్టులు చేశారు. అలాగే... మొత్తం టెస్టుల సంఖ్య 5కోట్ల 62 లక్షల 60వేల 928కి చేరింది. 
 
ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక కేసులున్న దేశాల్లో అమెరికా తర్వాత భారత్... టాప్-2లో ఉంది. అక్టోబర్‌లో టాప్-1లోకి భారత్ వెళ్తుందంటున్నారు. రోజువారీ నమోదవుతున్న కేసుల్లో భారత్ మొదటి స్థానంలో కొనసాగుతోంది. అత్యధిక మరణాల్లో అమెరికా, బ్రెజిల్ తర్వాత భారత్ మూడోస్థానంలో ఉంది. రోజువారీ మరణాల్లో భారత్ తర్వాత బ్రెజిల్, అమెరికా ఉన్నాయి.