గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 17 ఫిబ్రవరి 2023 (09:45 IST)

డ్యాన్సర్‌పై సామూహిక అత్యాచారం.. కారులో కిడ్నాప్ చేసి..?

gang rape
ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలో ప్రాపర్టీ డీలర్ పుట్టినరోజు వేడుకకు పిలిచిన డ్యాన్సర్‌పై ఆరుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు. నిందితులందరూ పరారీలో ఉన్నారని, వారిని అరెస్టు చేసేందుకు గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. 
 
వివరాల్లోకి వెళితే.. దీపక్ నగర్‌లో జరిగిన పార్టీలో ముగ్గురు డ్యాన్సర్ల బృందాన్ని రూ. 6,000కు ఫిక్స్  చేసుకున్నారు. ఈ ఈవెంట్ నుంచి ఆమె ఇంటికి ప్రయాణం అయ్యే సమయంలో, మత్తులో ఉన్న ఆరుగురు వ్యక్తులు ఆమెను కారులో అపహరించి, సమీపంలోని అడవిలో ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. 
 
ప్రాణాలతో బయటపడిన బాధితురాలు ఫిర్యాదు ఇచ్చినా పోలీసులు పట్టించుకోకపోవడంతో.. తర్వాత, ఆమె ఉన్నావ్ సదర్‌లోని కొత్వాలి పోలీసులను ఆశ్రయించింది, ఆ తర్వాత నిందితులపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 376 (రేప్) కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగించారు. 
 
పోలీసు సూపరింటెండెంట్ (ఉన్నావ్), సిద్ధార్థ్ మీనా మాట్లాడుతూ, బాధితురాలికి అత్యాచారం ఆరోపణలను నిర్ధారించడానికి వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగిందని.. నిందితులను అదుపులోకి తీసుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.