శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 21 మార్చి 2023 (09:55 IST)

డ్యాన్స్ చేస్తూ కుప్పకూలి ప్రాణాలు విడిచిన ప్రభుత్వ ఉద్యోగి.. ఎక్కడ?

govt employee
ఇటీవలికాలంలో హఠాత్తుగా గుండెపోటుకుగురై ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. ఇలాంటి ఘటనలు వరుసగా సంభవిస్తున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్‌లో ఓ ప్రభుత్వ ఉద్యోగి డ్యాన్స్ చేస్తూ కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. తపాలా శాఖలో అసిస్టెంట్ డైరెక్టరుగా పని చేసే సురేంద్ర కుమార్ దీక్షిత్ అనే వ్యక్తి ఈ కార్యక్రమంలో పాల్గొని, స్నేహితులతో కలిసి డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. 
 
ఆయనకు ఉన్నట్టుండి గుండెపోటు రావడంతో మృతి చెందారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. తన స్నేహితులతో కలిసి ఓ పాటకు డ్యాన్స్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. ఆయన చుట్టూ ఉన్న మిగిలిన వారంతా ఆయన్ను కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. 
 
భోపాల్‌లో తపాల శాఖ ఈ నెల 13 నుంచి 17వ తేదీ వరకు 34వ ఆల్ ఇండియా పోస్టల్ హాకీ టోర్నమెంట్‌ను మేజర్ ధ్యాన్‌చంద్ హాకీ స్టేడియంలో నిర్వహించింది. ఆఖరి మ్యాచ్ 17వ తేదీన జరిగింది. మార్చి 16వ తేదీన కార్యాలయ ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో సురేంద్ర కుమార్ ఓ పాటకు డ్యాన్స్ చేస్తూ కుప్పకూలి ప్రాణాలు విడిచాడు.