మీ కూతుర్ని చంపేశాను.. వచ్చి డెడ్‌బాడీని తీసుకెళ్లండి..

Last Updated: శనివారం, 10 నవంబరు 2018 (15:41 IST)
కట్టుకున్న భార్యను అత్యంత దారుణంగా హత్య చేశాడు దుర్మార్గపు భర్త. హత్య చేసిన తర్వాత అత్తగారికి ఫోన్ చేసి మరీ చెప్పాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సత్నాకు చెందిన మోనూ అతని పూజల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఇదే క్రమంలో శుక్రవారం రాత్రి కూడా భార్యాభర్తల మధ్య గొడవ చోటుచేసుకుంది. 
 
దీంతో ఆగ్రహానికి గురైన మోనూ భార్యను గొంతునులిమి అనంతరం రాయితో కొట్టి హతమార్చాడు. అనంతరం భార్య తల్లిదండ్రులకు ఫోన్ చేసి.. మీ కూతుర్ని చంపేశాను.. వచ్చి డెడ్‌బాడీ తీసుకెళ్లండి అంటూ ఫోన్ చేసి చెప్పాడు. దీంతో ఆందోళనకు గురైన అత్తమామలు కంగారుగా మోను ఇంటికి పరిగెత్తుకొచ్చారు. ఇంట్లో తమ కుమార్తె రక్తపు మడుగులో పడివుంది. 
 
అయితే అప్పటికీ మోను పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి.. మోనుని వెతికి పట్టుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.దీనిపై మరింత చదవండి :