సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 6 ఆగస్టు 2022 (13:53 IST)

కర్ణాటక సీఎం బసవరాజ్‌ బొమ్మైకి కరోనా పాజిటివ్

basavaraj bommai
కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మైకి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్‌ వేదికగా వెల్లడించారు. గత కొద్దిరోజులుగా తనను కలిసినవారంతా తక్షణమే ఐసోలేషన్‌లోకి వెళ్లాలని, పరీక్షలు చేయించాకోవాలని సీఎం విజ్ఞప్తి చేశారు. 
 
తనకు కరోనా సోకడంతో ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు తెలిపారు. స్వల్ప లక్షణాలు కన్పించిన వెంటనే పరీక్ష చేయించుకుంటే పాజిటివ్‌ వచ్చినట్లు చెప్పారు. ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నారు.