మంగళవారం, 28 మార్చి 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated: శుక్రవారం, 20 జనవరి 2023 (16:16 IST)

మైనర్లకు కండోమ్స్, పిల్స్ అమ్మకాలపై కర్ణాటక సర్కారు క్లారిటీ

condom
మైనర్లకు కండోమ్స్, గర్భనిరోధక మాత్రల అమ్మకాలపై నిషేధం విధించారంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై కర్ణాటక సర్కారు స్పందించింది. మైనర్లకు కండోమ్స్, గర్భనిరోధక మాత్రల అమ్మకాలపై ఎలాంటి నిషేధం విధించలేదని.. వాళ్లు కొనుగోలు చేయకుండా నిరోధించేందుకు ఫార్మసిస్ట్ లను కౌన్సిలింగ్ ఇవ్వమని కోరామని కర్ణాటక ప్రభుత్వం స్పష్టం చేసింది. 
 
18 ఏళ్లలోపు వారికి కండోమ్‌లు, గర్భనిరోధక మాత్రాలు విక్రయించకుండా నిషేధిస్తూ ఫార్మాసిస్ట్‌లకు ఎలాంటి సర్క్యులర్‌ను జారీ చేయలేదని కర్ణాటక డ్రగ్స్ కంట్రోల్ విభాగం క్లారిటీ ఇవ్వడమే కాకుండా.. దీనిపై వస్తున్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేసింది. 
 
ఎక్కడా కండోమ్స్, పిల్స్ పై నిషేధం విధించలేదని..  లైంగికంగా సంక్రమించే వ్యాధులను నివారించేందుకు, జనాభా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం వీటిని ప్రోత్సహిస్తోందని కర్ణాటక సర్కారు తెలిపింది. అంతేగాకుండా.. స్కూల్ పిల్లలకు మాత్రం కాకుండా.. 18 సంవత్సరాల లోపు వున్న యువకులకు ఈ మందులు విక్రయించకూడదని సర్కులర్ లో స్పష్టం చేసినట్లు కర్ణాటక డ్రగ్స్ కంట్రోలర్ భాగోజీ టి ఖానాపూరే వివరించారు.