శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్

డోంట్ వర్రీ.. హాయిగా నిద్రపోనివ్వండి.. అదే మేల్కొంటుంది.. ప్రజ్ఞాన్‌ నిద్రపై ఇస్రో చైర్మన్

chandrayaan-3
చంద్రుడి దక్షిణ మండలం అధ్యయనం నిమిత్తం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3పై ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నట్టు ఇస్రో చైర్మన్ సోమ్‌నాథ్ సూచన ప్రాయంగా వెల్లడించారు. చంద్రయాన్-3పై ఆశలు సజీవంగానే ఉన్నాయని తెలిపారు. దానిని నిద్రలేపి పరిశోధనలు పురమాయించేందుకు శాస్త్రవేత్తలు చేసిన ప్రయత్నాలు ఫలిచంలేదు. కానీ ఇస్రో మాత్రం అది నిద్రలేస్తుందని గట్టినమ్మకంతో చెబుతుంది. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, రోవర్ ప్రజ్ఞాన్ తిరిగి క్రియాశీలమయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ప్రజ్ఞాన్ ప్రశాంతంగా నిద్రిస్తుందని, దానిని అలాగే వదిలివేద్దామని పేర్కొన్నారు. తాను తిరిగి క్రియాశీలం కావాలనుకున్నపుడు అదే మేల్కొంటుందని చెప్పారు. మైనస్ 200 డిగ్రీల వద్ద ఉన్నపుడు తాము పరీక్షించినపుడు అది పని చేసిందని తెలిపారు. ప్రజ్ఞాన్ మళ్లీ పని చేస్తుందని తాము చెప్పడానికి అదే కారణమని సోమనాథ్ వెల్లడించారు.