శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 30 ఆగస్టు 2023 (12:12 IST)

చంద్రునిపై ఆక్సిజన్ గుర్తింపు.. హైడ్రోజన్ కోసం వేట మొదలు..

chandrayaan-3
చంద్రుడిపై పరిశోధనల్లో భారత్ పైచేయి సాధించిందనే చెప్పాలి. చంద్రుడిపై ఆక్సిజన్ ఆనవాళ్లను చంద్రయాన్ -3 గుర్తించడంతో అంతరిక్ష రంగంలో కీలక ముందడుగు వేసింది. అలాగే హైడ్రోజన్ ఆనవాళ్లను కూడా గుర్తిస్తే ఇక తిరుగుండదు. చంద్రయాన్‌ 3 పరిశోధనలు సూపర్‌ సక్సెస్‌ఫుల్‌గా సాగుతోంది. 
 
చంద్రయాన్-3 ప్రజ్ఞాన్ రోవర్‌లో అమర్చిన పరికరం చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలో ఆక్సిజన్ ఉనికిని నిర్ధారించింది. చంద్రునిపై ఆక్సిజన్ తర్వాత హైడ్రోజన్ కూడా అందుబాటులో ఉంటే.. చంద్రునిపై నీటిని తయారు చేయడం సులభం అవుతుంది. 
 
సల్ఫర్, అల్యూమినియం, కాల్షియం, ఐరన్, క్రోమియం, టైటానియం, మాంగనీస్, సిలికాన్. అంటే, ఈ వస్తువుల మొత్తం ఎక్కువ లేదా తక్కువ కావచ్చు, కానీ ఇవన్నీ చంద్రుని ఉపరితలంపై ఉన్నాయని ఇస్రో చేసిన ట్వీట్‌లో పేర్కొంది.