గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 14 జూన్ 2022 (15:03 IST)

సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్: 18 నెలల్లో 10 లక్షల ఉద్యోగాల భర్తీ

Jobs
సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎదురుచూస్తున్నవారికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సర్కారు శుభవార్త చెప్పింది. లక్షల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు ప్రకటించింది. అతిపెద్ద రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కోసం కేంద్ర ప్రభుత్వం డెడ్‌లైన్ కూడా పెట్టుకుంది. వచ్చే ఏడాదిన్నరలో అంటే 18 నెలల్లో 10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు.
 
కేంద్ర ప్రభుత్వానికి చెందిన అన్ని ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో మానవ వనరుల పరిస్థితిని ప్రధాని మోదీ సమీక్షించారు. ఏడాదిన్నరలో 10 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసేలా అన్ని శాఖలకు ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాలు జారీ చేసినట్టు ప్రధాన మంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది.  
 
కోవిడ్ కారణంగా వాయిదా పడుతూ వస్తోన్న ఉద్యోగాల రిక్రూట్‌మెంట్ త్వరలో ప్రారంభం కానుంది.తాజాగా  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అతిపెద్ద రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ప్రకటించడంతో నేషనల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ కార్యకలాపాలు వేగవంతం అయ్యే అవకాశం ఉంది. 
 
ఈ ఏడాదే నేషనల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ సెట్ జరగొచ్చు. ఈ సెట్ నెలకోసారి ఉంటుంది. టెన్త్, ఇంటర్, డిగ్రీ పాసైనవారికి వేర్వేరు లెవెల్స్‌లో ఈ ఎగ్జామ్ ఉంటుంది.