మంగళవారం, 23 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 10 మార్చి 2022 (11:16 IST)

ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టుగానే పంజాబ్‌లో ఆప్ హవా

ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టుగానే పంజాబ్‌లో భారీ లీడింగ్‌లో ఆప్ కొనసాగుతోంది. తాజాగా వస్తున్న ఫలితాల ప్రకారం ఆప్ జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తోంది. పంజాబ్‌లో అనుకున్నట్టే ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) దూకుడు ప్రదర్శిస్తోంది.
 
గట్టిపోటీ ఇస్తుందనుకున్న కాంగ్రెస్.. ఆప్‌కు దరిదాపుల్లో కూడా లేదు. ఇప్పటివరకు 90 స్థానాల్లో ఆప్ లీడింగ్‌లో ఉంది. అటు కాంగ్రెస్ 13 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ 59ని దాటేసిన ఆప్ పంజాబ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం దాదాపు ఖాయమే.
 
శిరోమణి అకాలీదళ్ 8 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. ఇక ఆప్ భారీ లీడింగ్ కనబరుస్తుండడంతో పార్టీ శ్రేణులు విజయోత్సవంలో మునిగిపోయాయి. 
 
ముఖ్యమంత్రి అభ్యర్థి భగవంత్ మాన్ ఇంటి వద్ద ఆప్ కార్యకర్తలు, నేతలు మిఠాయిలు పంచుకుని పండగ చేసుకుంటున్నారు.