శుక్రవారం, 9 జూన్ 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated: గురువారం, 17 నవంబరు 2022 (19:43 IST)

రాజీవ్ ముద్దాయిలను విడుదల చేశారుగా.. నన్నూ రిలీజ్ చేయండి.. స్వామి శ్రద్ధానంద్

Swami Shradhanand  Read more at: http://timesofindia.indiatimes.com/articleshow/95566314.cms?utm_source=contentofinterest&utm_medium=text&utm_campaign=cppst
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసుల హంతకులను విడుదల చేసినట్టుగానే తనను కూడా విడుదల చేయాలని స్వామి శ్రద్ధానంద్ కోరుతున్నారు. ఈ మేరకు ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాను కూడా గత 29 యేళ్లుగా జైలు జీవితాన్ని గడుపుతున్నానని, ఇప్పటివరకు ఒక్కసారిగా పెరోల్ ఇవ్వలేదని ఆయన గుర్తు చేశారు. ఈ మేరకు ఆయన ప్రధాన న్యాయమూర్తి డీవీ చంద్రసూడ్ సారథ్యంలోని త్రిసభ్య ధర్మాసనం ముందు శ్రద్ధానంద్ తరపు న్యాయవాది ఓ పిటిషన్ దాఖలు చేశారు. 
 
మైసూర్ మూజీ దివాన్ సర్ మీర్జా ఇస్మాయిల్ మనవరాలు అయిన షకీరా ... మాజీ రాయబారి అక్బర్ ఖలీలీ నుంచి విడాకులు తీసుకున్నారు. యేడాది తర్వాత అంటే 1986లో ఆమె స్వామి శ్రద్ధానంద్‌ను పెళ్లి చేసుకున్నారు. అయితే, 1991లో బెంగుళూరులో రిచ్‌మండ్ రోడ్‌లో బంగ్లాలో రూ.600 కోట్ల విలువైన ఆస్తిని తన వశం చేసుకునేందుకు షకీరాను శ్రద్ధానంద్ సజీవంగా పాతిపెట్టినట్టు సమాచారం. ఈ కేసులో శ్రద్ధానంద్‌ను గత 1994 ఏప్రిల్ 30వ తేదీన అరెస్టు చేశారు. 
 
2000లో ట్రయల్ కోర్టు విచారణ జరిపి శ్రద్ధానంద్ ముద్దాయిగా నిర్ధారించి ఉరిశిక్షను విధించగా, 2005లో కర్నాటక హైకోర్టు ఆ శిక్షను బలపరిచింది. ఆ తర్వాత 2008లో శ్రద్ధానంద్ చేసుకున్న అప్పీల్‌‍పై సుప్రీంకోర్టు మరణశిక్షను జీవిత ఖైదీగా మార్చింది. మొత్తంమీద శ్రద్ధానంద్ గత 1994 నుంచి జైలులోనే ఉంటున్నారు. 
 
ఈ నేపథ్యంలో తాజాగా రాజీవ్ హంతకులను వదిలివేయాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పును ఉటంకిస్తూ, తనకు కూడా రాజీవ్ ముద్దాయిల తరహాలనే విముక్తి కల్పించాలని కోరారు. పైగా అరెస్టు చేసినప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్కసారిగా పెరోల్ తీసుకోలేదని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు.