బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 20 అక్టోబరు 2021 (10:25 IST)

ఉత్తరాఖండ్‌: భారీ వర్షపాతంతో రికార్డు బద్దలు.. 107 సంవత్సరాల క్రితం..?

Uttarakhand
దేవభూమి ఉత్తరాఖండ్‌ ప్రకృతి ప్రకోపానికి వణికిపోతోంది. మూడు రోజులుగా ఎడతెగని వర్షాలు రాష్ట్రంలో బీభత్సం సృష్టించాయి. పాశ్చాత్య అవాంతరాలు, ఆగ్నేయ గాలుల కారణంగా కురిసిన అత్యంత భారీ వర్షాలతో పర్వతాల నుంచి మైదానాల వరకు పెను విధ్వంసం కలిగింది. ఈ క్రమంలో 100 సంవత్సరాల క్రితం నమోదైన రికార్డులూ బద్దలయ్యాయి. 
 
వాతావరణ శాస్త్రవేత్తల ప్రకారం.. కుమావన్ ప్రాంతంలోని ముక్తేశ్వర్‌లో 107 సంవత్సరాల క్రితం సెప్టెంబర్ 18, 1914 న 254.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గత 24 గంటల్లో ముక్తేశ్వర్‌లో 340.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. చంపావత్‌లో 580 మి.మీ, నైనిటాల్‌లో 530 మి.మీ, జియోలికోట్ 490 మి.మీ, భీమ్‌టాల్ 400 మి.మీ, హల్ద్వానీలో 300 మి.మీ వర్షాపాతం రికార్డయింది. ఇంకా చాలా ప్రాంతాల్లో 100 నుంచి 500 మిల్లీమీటర్లకుపైగా వర్షపాతం నమోదైంది.
 
పంత్‌నగర్లో 31 సంవత్సరాల కిందట నమోదైన భారీ వర్షపాతం రికార్డు బద్దలైందన్నారు. 1990 జూలై 10న పంత్‌నగర్‌లో 228 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని, గత 24 గంటల్లో పంత్‌నగర్‌లో 403.9 మిల్లీమీటర్ల రికార్డయిందన్నారు. గతంలో కంటే రెట్టింపు స్థాయిలో వర్షం కురిసిందన్నారు. అయితే, గత 24 గంటల్లో రాష్ట్రంలో సగటున 1.1 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. రుతుపవనాల్లో మార్పుల కారణంగా ఊహించని రీతిలో రాష్ట్రవ్యాప్తంగా 122 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదైంది.