శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 27 ఆగస్టు 2018 (14:49 IST)

ముందుగానే చనిపోయిన వాజ్‌పేయి.. మోడీ ప్రసంగానికి అడ్డొస్తుందనీ... ?!

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి మృతిపై ఎన్డీయే భాగస్వామ్య పార్టీల్లో ఒకటైన శివసేన ఓ ధర్మసందేహాన్ని లేవనెత్తింది. ఆ సందేహం ప్రకారం వాజ్‌పేయి ఆగస్టు 15వ తేదీ కంటే ముందుగానే చనిపోయారన్న భావన కలిగిస్తో

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి మృతిపై ఎన్డీయే భాగస్వామ్య పార్టీల్లో ఒకటైన శివసేన ఓ ధర్మసందేహాన్ని లేవనెత్తింది. ఆ సందేహం ప్రకారం వాజ్‌పేయి ఆగస్టు 15వ తేదీ కంటే ముందుగానే చనిపోయారన్న భావన కలిగిస్తోంది. ఈ మేరకు ప్రత్యేక కథనాన్ని శివసేన అధికారిక పత్రిక సామ్నాలో ప్రచురించింది.
 
ఈ పత్రిక సంపాదకీయంలో 'ప్రజలకంటే ముందుగా.. మన నేతలు స్వరాజ్యం గురించి సరిగా అర్థం చేసుకోవాలి. వాజ్‌పేయి ఆగస్టు 16న మృతిచెందారు. కానీ 12-13 తేదీల నుంచే ఆయన ఆరోగ్యం తీవ్రంగా విషమిస్తోంది. ఉత్సాహంగా జరగాల్సిన స్వాతంత్ర్య దినోత్సవం దేశవ్యాప్తంగా సంతాపదినాలు, జెండాల అవనతం లేకుండా ఉండేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందా? లేక ఎర్రకోట మీదుగా సుదీర్ఘమైన ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగానికి అడ్డంకులు లేకుండా ఉండేందుకు వాజ్‌పేయి మృతిని 16న ప్రకటించారా?' అని 'స్వరాజ్యమంటే ఏంటి?' అనే శీర్షికతో ప్రచురించిన సంపాదకీయంలో శివసేన రాజ్యసభ ఎంపీ, సామ్నా ఎడిటర్‌ సంజయ్‌ రౌత్‌ సందేహం లేవనెత్తారు.