గురువారం, 5 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 18 జులై 2022 (13:36 IST)

అహ్మదాబాద్‌లో కుంగిపోయిన రోడ్డు వీడియో వైరల్

road collapse
road collapse
నిత్యం రద్దీగా వుండే అహ్మదాబాద్‌లో ఓ రోడ్డు కుంగిపోయింది. రోడ్డు కూలిన ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
 
మెట్రో రైలు మార్గంలోని పిల్లర్ నంబర్ 123 సమీపంలో రోడ్డు మధ్యలో పెద్ద గుంత పడినట్లు అధికారులు వెల్లడించారు. ఈ రహదారిని నెల రోజుల క్రితం నిర్మించినట్లు సమాచారం. 
 
ఈ ఘటనతో ఆ మార్గంలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. అయితే ఆ సమయంలో అటువైపు వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
 
గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరంలోని వస్త్రాల్ ప్రాంతంలోని సురభి పార్క్ సమీపంలో కొత్తగా నిర్మించిన ఈ రహదారి ఆదివారం కుప్పకూలింది. గుజరాత్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తూనే ఉన్న సంగతి తెలిసిందే.