సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 10 మే 2023 (14:39 IST)

అత్తను ఫ్రైయింగ్ పాన్‌తో కొట్టి చంపిన కోడలు..

crime scene
ఢిల్లీలో 48 ఏళ్ల మహిళ తన అత్తగారిని పాన్‌తో కొట్టి చంపింది. 86 ఏళ్ల వృద్ధురాలిని చూసుకోలేక విసుగుచెంది హతమార్చింది. కీళ్లనొప్పులతో బాధపడుతూ వచ్చిన ఆ వృద్ధురాలిని బాధ్యతగా చూసుకోవాల్సిన కోడలు పాన్‌తో కొట్టి చంపేసింది.  
 
వివరాల్లోకి వెళితే.. సుర్జిత్ సోమ్ (51), అతని భార్య శర్మిష్ట సోమ్ (48), వారి 16 ఏళ్ల కుమార్తె 2014 నుండి నెబ్ సరాయ్‌లోని స్వస్తిక్ రెసిడెన్సీలో నివసిస్తున్నారు. సుర్జిత్ ఇంటికి ఆయన తల్లి చేరుకుంది. అయితే వయస్సు మీద పడటంతో ఆమె బాగుగోలు చూసుకోవడం ఇష్టం లేక విసుగు చెంది కోడలు శర్మిష్ట అత్తను పాన్‌తో కొట్టి చంపేసింది. 
 
తన తల్లి చాలా కాలంగా ఆర్థరైటిస్‌తో బాధపడుతోందని, నడవడానికి ఇబ్బందిగా ఉందని సుర్జిత్ చెప్పాడు. సుర్జిత్ తన తల్లి దినచర్యను పర్యవేక్షిస్తున్నందున తన ఫోన్‌లోని కెమెరా నుండి ప్రత్యక్ష ఫీడ్ ఉందని చెప్పాడు. అలాగే ఘటన జరిగిన రోజు కరెంటు కోత వల్ల కెమెరా పనిచేయలేదని పోలీసులకు తెలిపాడు.
 
మొదట్లో కుటుంబ సభ్యులతో పాటు ఇరుగుపొరుగు వారికి ఎలాంటి అనుమానం రాలేదు.
 
మృతదేహాన్ని ఎయిమ్స్ మార్చురీకి తరలించి ఏప్రిల్ 29న శవపరీక్ష నిర్వహించారు. పోస్ట్‌మార్టం సమయంలో, సాధారణంగా కింద పడిపోవడం వల్ల ఇలాంటి గాయాలు జరగవని డాక్టర్ తెలిపారు. ఇది హత్యేనని గుర్తించారు. ఘటన జరిగిన రోజు ఫ్లాట్‌లో శర్మిష్ట మాత్రమే ఉంది.
 
ఏప్రిల్ 28వ తేదీ ఉదయం 10:30 గంటల ప్రాంతంలో శర్మిష్ట హాసి సోమ్ ఫ్లాట్‌లోకి ఫ్రైయింగ్ పాన్‌తో ప్రవేశించినట్లు సిసిటివి ఫుటేజీ వెల్లడించింది. 
 
సీసీటీవీ కవరేజీ లేని వంటగదిలోని బాధితురాలి వెనుకకు వెళ్లి ఆమెను చాలా దెబ్బలు కొట్టింది. సీసీటీవీ రికార్డింగ్‌లో వృద్ధ మహిళ రోదనలు వినిపిస్తున్నాయని తేలింది. దీంతో కోడలే నిందితురాలిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.