మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : ఆదివారం, 1 డిశెంబరు 2019 (10:08 IST)

ఆదివారం (01-12-2019) మీ రాశిఫలాలు

మేషం : హోటల్, క్యాటరింగ్ పనివారలకు సదవకాశాలు లభిస్తాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులకు తోటివారి వల్ల చికాకులు తప్పవు. మిత్రులను కలుసుకుంటారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీ శ్రీమతి సలహా పాటించడం వల్ల ప్రయోజనం ఉంటుంది.
 
వృషభం : ఆర్థిక కుటుంబ సమస్యలు పరిష్కారమయ్యే సూచనలున్నాయి. ప్రయత్నపూర్వకంగా పాత బాకీలు వసూలు కాగలవు. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల్లోని వారికి కలిసివస్తుంది. కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభదాయకం. ఆత్మీయులకు మీ సమస్యలు చెప్పుకోవడం వల్ల ప్రయోజనం ఉంది.
 
మిథునం : దీర్ఘకాలిక పెట్టుబడులు, వ్యాపారాల విస్తరణల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. ఆపత్సమయంలో బంధువులు అండగా నిలుస్తారు. స్త్రీలకు కళ్ళు, తల, నరాలకు సంబంధించిన చికాకు లెదుర్కోవలసివస్తుంది. రాబడికి మించిన ఖర్చులున్నా మీ అవసరాలకు కావలసిన ధనం సర్దుబాటు కాగలదు.
 
కర్కాటకం : ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు వాయిదా పడటం వల్ల నిరుత్సాహానికి గురవుతారు. స్త్రీలకు దైవ కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. దంపతుల మధ్య పలు విషయాలు చర్చకు వస్తాయి. ఉపాధ్యాయులకు పనిభారం, చికాకులు అధికమవుతాయి. అదనపు రాబడి కోసం యత్నాలు సాగిస్తారు.
 
సింహం : స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. వస్త్ర, ఫ్యాన్సీ, పచారి వ్యాపారులకు పురోభివృద్ధి. మీ సమర్థత, వాక్చాతుర్యం ఎదుటివారిని ఆకట్టుకుంటాయి. ఉద్యోగస్తులు అదనపు బాధ్యతలు స్వీకరిస్తారు. ఉన్నతస్థాయి అధికారులకు అపరిచిత వ్యక్తులపట్ల అప్రమత్తత అవసరం. ఆలయాలను సందర్శిస్తారు.
 
కన్య: వృత్తి వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. చేపట్టిన పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. హోటల్, తినుబండారాల వ్యాపారస్తులకు సంతృప్తి కానవచ్చును. సభ, సమావేశాల్లో పాల్గొంటారు. స్త్రీలు పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. పెద్ద హోదాలో ఉన్నవారికి అధికారిక పర్యటనలు అధికమవుతాయి.
 
తుల : ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కాంట్రాక్టర్లకు ప్రయత్నపూర్వకంగా టెండర్లు అనుకూలిస్తాయి. స్త్రీలు పట్టుదలకు పోకుండా పరిస్థితులకు అనుగుణంగా మెలగవలసి ఉంటుంది. మిత్రులను కలుసుకుంటారు. గృహంలో మార్పులు చేర్పులు వాయిదా పడతాయి. ప్రింటింగ్ రంగాల వారికి పనివారితో చికాకులు తప్పవు.
 
వృశ్చికం : స్త్రీలు టీవీ ఛానెళ్ళ కార్యక్రమాల్లో రాణిస్తారు. వ్యాపారాల్లో కొత్త కొత్త పథకాలతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. బంధువుల నుండి ఆహ్వానాలు అందుకుంటారు. తలపెట్టిన పనుల్లో ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. బిల్లులు చెల్లిస్తారు. ద్విచక్ర వాహనంపై దూరప్రయాణాలు మంచిది కాదని గమనించండి.
 
ధనస్సు : ఆర్థిక స్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. మీ కళత్ర మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. ఆదాయ వ్యయాలు మీ అంచనాలకు తగినట్టుగానే ఉంటాయి. మీ సంతానం పై చదువుల కోసం పొదుపు పథకాలు చేపడతారు. సొంత వ్యాపారాలు, జాయింట్ వెంచర్లు సంతృప్తికరంగా సాగుతాయి.
 
మకరం : స్థిరాస్తిని అమర్చుకోవాలనే సంకల్పం ఫలిస్తుంది. మీ శ్రీమతి సలహా పాటించడం అన్ని విధాల శ్రేయస్కరం. విద్యార్థుల్లో మనోధైర్యం, ఏకాగ్రత నెలకొంటాయి. పత్రికా సంస్థల్లోని వారికి ఒత్తిడి, ఆందోళనలు అధికమవుతాయి. కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది.
 
కుంభం : దూరప్రయాణాలు, పుణ్యక్షేత్ర సందర్శనలకు పథకాలు రూపొందిస్తారు. ఆలస్యంగానైనా చేపట్టిన పనులు సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. స్త్రీలలో హడావుడి, నూతనోత్సాహం చోటు చేసుకుంటాయి. భాగస్వామిక చర్చల్లో మీ ప్రతిపాదనలకు, సూచనలకు ఆమోదం లభిస్తుంది. రుణయత్నాల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కొంటారు.
 
మీనం : మీ అలవాట్లు, బలహీనతలకు గోప్యంగా ఉంచడం క్షేమదాయకం. నిరుద్యోగుల ఆలోచనలు ఉపాధి పథకాల దిశగా సాగుతాయి. ఖర్చులు పెరిగే ఆస్కారం ఉంది. ధనవ్యయంలో ఏకాగ్రత వహించండి. మీ సమస్యలకు ఒక పరిష్కార మార్గం గోచరిస్తుంది. చేతివృత్తులు, క్యాటరింగ్ పనివారలకు పురోభివృద్ధి.