శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్

గురువారం (28-11-2019) దినఫలాలు - సాయి పారాయణం చేయడం వల్ల...

మేషం : రావలసిన ఆదాయం గురించి ఆందోళన చెందుతారు. చేపట్టిన పనులలో స్వల్ప అవరోధాలు ఎదుర్కొంటారు. ట్రాన్స్‌పోర్టు, ఆటోమొబైల్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. ఎదుటివారి తీరును గమనించి తదనుగుణంగా వ్యవహరించడం మంచిది. నిరుద్యోగులకు మధ్యవర్తుల పట్ల ఆప్రమత్తత అవసరం. 
 
వృషభం : గృహంలో ఏదైనా వస్తువు పోయేందుకు ఆస్కారం ఉంది. విద్యార్థినులకు వాహనం నడుపుతున్నపుడు మెలకువ అవసరం. కాంట్రాక్టర్లకు నూతన టెండర్లు అనుకూలిస్తాయి. ఇతరుల గురించి మీరు చేసిన వ్యాఖ్యలు సమస్యలకు దారితీయొచ్చు. ఉద్యోగస్తుల శ్రమకు మంచి గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తాయి. 
 
మిథునం : ఆర్థిక లావాదేవీలు, కుటుంబ వ్యవహారాలు సమర్థంగా నిర్వహిస్తారు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్ కంప్యూటర్ రంగాల వారికి పురోభివృద్ధి. ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లు అనుకూలిస్తాయి. ఖర్చులు పెరిగే ఆస్కారం ఉంది. ధన వ్యయంలో ఏకాగ్రత వహించండి. 
 
కర్కాటకం : వస్త్ర, ఫ్యాన్సీ, బేకరీ వ్యాపారులకు పురోభివృద్ధి. ఖర్చులు అధికమవుతాయి. స్త్రీలు విదేశీ వస్తువుల పట్ల ఆకర్షితులవుతారు. ఉద్యోగస్తులకు శక్తి సామర్థ్యాలను అధికారులు గుర్తిస్తారు. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల అవసరం. నిరుద్యోగులు నిరుత్సాహం విడనాడి శ్రమించిన సత్ఫలితాలు లభిస్తాయి. 
 
సింహం : భాగస్వామిక వ్యాపారాలు, జాయింట్ వెంచర్లు సంతృప్తికరంగా సాగుతాయి. చేపట్టిన పనులలో ఒత్తిడి, జాప్యం వంటి చికాకులు తప్పవు. ఉద్యోగస్తులకు తోటివారి నుంచి ఆహ్వానాలు అందుతాయి. మీ సంతానం ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. దూర ప్రయాణాలలో మెలకువ, వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం. 
 
కన్య : వస్త్ర, ఫ్యాన్సీ వ్యాపారాలు ఊపందుకుంటాయి. దైవారాధన పట్ల ఆసక్తి పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్ల వ్యవహారంలో ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. చేపట్టిన పనులు అర్థాంతరంగా నిలిపివేయవలసి వస్తుంది. 
 
తుల : విద్యార్థుల అత్యుత్సావం విపరీతాలకు దారితీసే ఆస్కారం ఉంది. మిత్రులకు సహాయ సహకారాలందిస్తారు. ధన వ్యయం విపరీతంగా ఉన్నా ప్రయోజనకరంగా ఉంటుంది. పెద్దలు, ఆత్మీయుల గురించి ఆందోళన చెందుతారు. ఆలయాలను సందర్శిస్తారు. కొత్తగా ప్రారంభించిన వ్యాపారాలు ప్రగతి పథంలో సాగుతాయి. 
 
వృశ్చికం : స్థిరాస్తి క్రయ విక్రయాలకు సంబంధించి ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. పారిశ్రామిక రంగాల వారికి సంతృప్తి, పురోభివృద్ధి. ఖర్చులు సామాన్యంగా ఉన్నా ధన వ్యయం విషయంలో అదుపు అవసరమని గమనించండి. ఉమ్మడి వ్యాపారాలు, లీజు, ఏజెన్సీలు, నూతన కాంట్రాక్టులు అనుకూలిస్తాయి. 
 
ధనస్సు : స్త్రీల ఓర్పు, ఏకాగ్రతకు ఇది పరీక్షా సమయం. దూర ప్రయాణాల్లో అసౌకర్యం, చికాకులు, తప్పవు. రుణ యత్నాలలో అనుకూలత, రావలసిన ధనం అందుకుంటారు. కీలకమైన వ్యవహారాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. నిరుద్యోగులు చేపట్టిన ఉపాథి పథకాల్లో క్రమేణా నిలదొక్కుకుంటారు. 
 
మకరం : సొంతంగా వ్యాపారం చేయాలనే మీ ఆలోచన మరికొంతకాలం వాయిదా వేయడం మంచిది. మీ ఆసయ సాధనకు సన్నిహితుల సహకారం లభిస్తుంది. ఖర్చులు ముందుగానే ఊహించినవి కావడంతో అవసరాలకు సరిపడ ధనం సమకూర్చుకుంటారు. చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఎదురవుతాయి. 
 
కుంభం : ఉపాధ్యాయుల శ్రమకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. సంగీత, సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. విలాసవస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కుటుంబ సౌఖ్యం, వాహనయోగం పొందుతారు. హోటల్, తినుబండరాలు, క్యాటరింగ్ పనివారలకు కలిసిరాగలదు. దైవ, పుణ్య కార్యాల్లో పాల్గొంటారు. 
 
మీనం : విద్యార్థినులకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. ముఖ్య కార్యాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. ఎదుటివారి తీరును గమనించి తదనుగుణంగా వ్యవహరించవలసి ఉంటుంది. ప్రేవేటు సంస్థలలోని వారికి యాజమాన్యం తీరు నిరుత్సాహం, విరక్తి కలిగిస్తుంది. స్త్రీలకు ఆరోగ్యంలో తగు జాగ్రత్తలు అవసరం.