శుక్రవారం (29-11-2019) దినఫలాలు - లక్ష్మీదేవిని ఆరాధించినా...

astro 8
రామన్| Last Updated: శుక్రవారం, 29 నవంబరు 2019 (13:45 IST)
మేషం :ప్లీడర్లకు గుమాస్తాలు, క్లయింట్‌ల విషయంలో చికాకులు తప్పవు. పాత బాకీలు వసూలు చేయడం వల్ల ఆర్థిక ఇబ్బంగి తొలగిపోతుంది. అధిక కృషి చేసి సత్ఫలితాలు పొందండి. సంఘంలో వైద్య రంగాల వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. రాజకీయాల్లో వారికి గుర్తింపు, రాణింపు లభిస్తుంది.

వృషభం : ఫ్యాన్సీ, కిరాణా, మందులు, ఎరువులు, రసాయనిక, సుగంధ ద్రవ్య వ్యాపారస్తులకు పురోభివృద్ధి. మీ సంతానం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. లాయర్లకు, ఆడిటర్లకు, డాక్టర్లకు శుభప్రదంగా వుండగలదు. స్త్రీల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. ధనం మంచి నీళ్ళ ప్రాయంగా ఖర్చవుతుంది.

మిథునం : పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాలల్లో వారికి పనిలో వత్తిడి, చికాకులు తప్పవు. కళల పట్ల క్రీడల పట్ల ఆసక్తి పెరుగును. ఆదాయానికి మించి ఖర్చులు ఉన్నా సంతృప్తి, ప్రయోజనకరంగా ఉంటాయి. స్త్రీలతో సంభాషించినపుడు సంయమనం పాటించండి. నూతన పెట్టుబడులకు శ్రీకారం చుడతారు.

కర్కాటకం : బంధువులు, సోదరుల మధ్య ఆత్మీయతలు నెలకొంటాయి. వృత్తుల వారి శ్రమకు తగిన ప్రతిఫలం దక్కుతుంది. పాత రుణాలు తీర్చడంతో
పాటు విలువైన పరికరాలు అమర్చుకుంటారు. ఒక వ్యవహారం నిమిత్తం తరచు ప్రయాణం చేయాల్సివస్తుంది. ట్రాన్స్‌పోర్ట్, ట్రావెలింగ్ రంగాల వారికి ఆశాజనకం.

సింహం : ఆర్థికంగా పురోభివృద్ధి సాధించే యత్నాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు నూతనోత్సాహం చోటు చేసుకుంటుంది. సొంతంగా వ్యాపారం చేయాలన్న మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. స్త్రీలకు ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయి. ప్లీడర్లకు, ప్లీడరు గుమాస్తాలకు పురోభివృద్ధి. ఖర్చులు అధికం.

కన్య : ఉద్యోగస్తులు శక్తి వంచన లేకుండా అధికారులను మెప్పిస్తారు. దంపతుల మధ్య కలహాలు తలెత్తుతాయి. గృహమునకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఫైనాన్సు, బ్యాంకింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం తప్పదు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. బిల్లులు చెల్లిస్తారు.

తుల : సన్నిహితులతో ముఖ్యమైన చర్చల్లో పాల్గొంటారు. కొబ్బరి, కూరలు, పండ్లు, పూల వ్యాపారస్తులకు సంతృప్తికరంగా ఉంటుంది. గృహోపకరణాలు సమకూర్చుకుంటారు. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. స్త్రీలకు అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. పాత్ర మిత్రుల కలయిక ద్వారా మీకెంతో సంతృప్తినిస్తుంది.

వృశ్చికం : ఉద్యోగస్తులు ఇతర వ్యాపకాలు వీడనాడి విధినిర్వహణలో అప్రమత్తంగా వ్యవహరించవలసి ఉంటుంది. విద్యార్థులు వాహనం నడుపుతున్నప్పుడు జాగ్రత్త అవసరం. మిమ్మల్ని పొగిడే వ్యక్తులకు దూరంగా ఉండండి. ఖర్చులు మీ రాబడికి మించడం వల్ల స్వల్ప ఒడిదుడుకులు తప్పవు. మీరు చేసిన పనికి ప్రత్యుపకారం పొందుతారు.

ధనస్సు : కుటుంబ పరిస్థితులు క్రమేణా మెరుగుపడతాయి. కిరాణా, ఫ్యాన్సీ, మందులు, పానీయ, ఆల్కహాలు వ్యాపారస్తులకు పురోభివృద్ధి కానవస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపరస్తులకు నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటం మంచిది. ప్రయాణాల్లో వస్తువుల పట్ల మెళకువ అవసరం.

మకరం : విదేశీ యత్నాల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కొంటారు. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉపాధ్యాయులకు విద్యార్థుల నుండి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. బ్యాంకింగ్ వ్యవహారాల్లో అపరిచిత వ్యక్తులపట్ల మెళకువ అవసరం. ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు.

కుంభం : స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. నియమాలకు కట్టుబడి ఉండుట వలన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. వస్త్ర, బంగారం, వెండి రంగాల్లో వారికి అనుకూలమైన కాలం. వాహనం అమర్చుకోవాలనే మీ కోరిక ఫలిస్తుంది. నూతన పెట్టుబడులు పెట్టినప్పుడు మెళకువ అవసరం.

మీనం : మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. రావలసిన పత్రాలు చేతికందుతాయి. స్త్రీలకు బంధువర్గాలతో పట్టింపులు అధికమవుతాయి. ప్రైవేట్ సంస్థల్లో వారు మార్పునకై చేయు ప్రయత్నాలు వాయిదా పడతాయి. ఉద్యోగస్తుల శ్రమకు, అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి.దీనిపై మరింత చదవండి :