ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్

03-10-2020 శనివారం మీ రాశి ఫలితాలు.. అనంత పద్మనాభ స్వామిని ఆరాధించడం వల్ల..?

అనంత పద్మనాభ స్వామిని ఆరాధించడం వల్ల సర్వదా శుభం కలుగుతుంది. 
 
మేషం: మీ ఉన్నతిని చాటుకోవటానికి ధనం విరివిగా వ్యయం చేయాల్సి వుంటుంది. కోర్టు వ్యవహారాలు విచారణకు వస్తాయి. విద్యార్థులు బయటి తినుబండారాలు భుజించడం వల్ల అస్వస్థతకు లోనవుతారు. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. ఐరన్, సిమెంట్, కలప వ్యాపారస్తులకు శుభదాయకంగా ఉంటుంది. 
 
వృషభం: ఆర్థిక సమస్యలు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ రంగాల్లో వారికి సదవకాశాలు లభిస్తాయి. కపటంలేని మీ ఆలోచనలు, సలహాలు మీకు అభిమానుల్ని సంపాదించి పెడుతుంది. క్రీడల పట్ల ఆసక్తి పెంచుకుంటారు. పట్టువిడుపు ధోరణితోనే మీ సమస్యలు పరిష్కారమవుతాయి.
 
మిథునం: విద్యార్థులు క్రీడలు, క్విజ్ పోటీల్లో పరీక్షల్లో విజయం పొందుతారు. భాగస్వామిక చర్చలు అనుకూలిస్తాయి. పాత రుణాలు తీరుస్తారు. స్త్రీలకు అలంకారాలు, విలాస వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. బంధువుల రాక వల్ల ఖర్చులు అధికంగా వుంటాయి. ఇతరులకు వాహనం ఇచ్చి ఇబ్బందులెదుర్కుంటారు.
 
కర్కాటకం: మీ కార్యక్రమాలు, పనులు వాయిదా వేసుకోవలసి వస్తుంది. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కోర్టు వ్యవహారాలు విచారణకు వస్తాయి. మీ సంతానం మొండి వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఉద్యోగస్తులకు ఒత్తిడి, అదనపు బాధ్యతలు, పనిభారం వంటి చికాకులు తప్పవు.
 
సింహం: ఆర్థిక లావాదేవీల్లో ఒడిదుడుకులు ఎదురైనా అధిగమిస్తారు. బంధుమిత్రులు మీ వైఖరిని తప్పు పడతారు. స్త్రీలకు పనిభారం అధికమవుతుంది. వృత్తులు, మార్కెట్ రంగాల వారికి శ్రమ అధికం. మీ అంచనాలు, పథకాలు బెడిసి కొట్టే ఆస్కారం వుంది. మీ మంచితనమే మీకు శ్రీరామ రక్షగా ఉంటుంది. 
 
కన్య: పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. బంధుమిత్రుల రాకపోకల వల్ల గృహంలో సందడి వాతావరణం నెలకొంటుంది. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. ఉద్యోగంలో శ్రమకు నైపుణ్యతకు మంచి గుర్తింపు లభిస్తుంది. అనుకోని విధంగా మీరు ప్రయాణం చేయాల్సి వస్తుంది. 
 
తుల: చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. ప్లీడర్లు, ప్లీడర్లకు ఒత్తిడి, ఆందోళనలు అధికమవుతాయి. బంధుమిత్రులతో కలిసి దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు బాగా శ్రమించాలి. విద్యార్థులు విదేశీ చదువుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.
 
వృశ్చికం: ఒకానొక నిజాన్ని ధైర్యంగా ఒప్పుకోవడంతో ఇతరులకు మీరంటే గౌరవం ఏర్పడుతుంది. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. ప్రయాణాలు వాయిదా పడతాయి. కుటుంబంలో ఒకరి ధోరణి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. నిరుద్యోగులకు ఆకస్మికంగా ఒక అవకాశం కలిసివస్తుంది. 
 
ధనస్సు: పత్రికా సంస్థల్లోని వారికి పనిభారం, తోటివారి వల్ల మాటపడక తప్పదు. స్త్రీలకు అవగాహన లేని విషయాల్లో సమస్యలు తలెత్తుతాయి. బకాయిలు, ఇంటి అద్దెల వసూలులో సౌమ్యంగా మెలగాలి. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. విద్యార్థులు వాహనం నడుపుతున్నప్పుడు ఏకాగ్రత అవసరం.
 
మకరం: మీ చిన్నారుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. ఆర్థికంగా ఎదగాలనే మీ ఆశయం నిదానంగా ఫలిస్తుంది. కాంట్రాక్టర్లకు అధికారుల నుంచి అభ్యంతరాలెదుర్కోవలసి వస్తుంది. పత్రిక, ప్రైవేట్ సంస్థల్లోని వారికి మార్పులే అనుకూలిస్తాయి. మీ జీవితభాగస్వామి విషయంలో దాపరికం మంచిది కాదు. 
 
కుంభం: కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు కలిసివస్తుంది. పెద్దల ఆశీస్సులు, ప్రముఖుల ప్రశంసలు పొందుతారు. సాహస ప్రయత్నాలు విరమించండి. రాజకీయ నాయకులకు పదవీ సమస్యలు అధికమవుతున్నాయి. స్త్రీలకు ఇరుగు పొరుగువారితో అంత సఖ్యత ఉండదు. మీ సంతానం మొండి వైఖరి చికాకులను కలిగిస్తుంది.
 
మీనం: బంధువులు మీ నుంచి పెద్దమొత్తంలో ధనసహాయం అర్థిస్తారు. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. స్త్రీలకు కళ్ళు, తల నరాలకు సంబంధించిన చికాకులెదుర్కోవలసి వస్తుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించుటకు అనువైన సమయం. పాత రుణాలు చెల్లించడంతో పాటు తాకట్టు విడిపించుకుంటారు.