ఆదివారం, 26 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్
Last Updated : గురువారం, 1 అక్టోబరు 2020 (07:15 IST)

01-10-2020 గురువారం రాశిఫలాలు - సాయిబాబాను ఆరాధించిన సర్వదా శుభం...(video)

మేషం : బంధు మిత్రులతో రహస్య సంభాషణలు కొనసాగిస్తారు. రాబడి బాగున్నప్పటికీ ఏదో ఒక ఖర్చు తగలడంతో పొదుపు సాధ్యంకాదు. సిమెంట్, ఐరన్, కలప, వ్యాపారస్తులకు సంతృప్తి కానవస్తుంది. మీ సమర్థతపై ఎదుటివారికి నమ్మకం కలుగుతుంది. స్త్రీలు టీవీ, ఛానెల్స్ కార్యక్రమాలలో రాణిస్తారు.  
 
వృషభం : శ్రీవారు, శ్రీమతి గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగించే పరిణామాలు ఎదుర్కొంటారు. కటుంబీకులు మీ అభిప్రాయాలతో ఏకీభవిస్తారు. అధికారులతో సంభాషించేటపుడు మెళకువ వహించండి. ప్రముఖుల ప్రమేయంతో ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలమవుతాయి. ఇతరులు చెప్పిన మాటపై దృష్టి పెట్టకండి. 
 
మిథునం : సహోద్యోగులతో అనుబంధాలు బలపడతాయి. స్వయంకృషితో రాణిస్తారన్న విషయం గ్రహించండి. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్ల విషయంలో పునరాలోచన అవసరం. అక్రమ సంపాదనల వైపు దృష్టిసారించకపోవడం మంచిది. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. 
 
కర్కాటకం : బ్యాంకు పనుల్లో ఏకాగ్రత వహించండి. దీర్ఘకాలిక సమస్యలకు మంచి పరిష్కారమార్గం గోచరిస్తుంది. చేతి, వృత్తి వ్యాపారులకు సదావకాశాలు లభిస్తాయి. కార్యాలయంలో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వాహనం కొనుగోలుకై చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. పెద్దల ఆరోగ్యంలో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. 
 
సింహం : ఆర్థిక విషయాలలో జోక్యం చేసుకోవాల్సి రావొచ్చు. ఉద్యోగ్తులకు అధికారులతో సమన్వయం లోపిస్తుంది. దంపతుల మధ్య కలహం తలెత్తుతుంది. ట్రాన్స్‌పోర్టు, ఎక్స్‌పోర్టు రంగాలలో వారికి సామాన్యంగా ఉంటుంది. ఆకస్మికంగా బిల్లులు చెల్లిస్తారు. సన్నిహితులు దూర ప్రయాణానికై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. 
 
కన్య : ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తినా మిత్రుల సహకారం లభిస్తుంది. క్రీడ, సాంఘిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. విద్యా, వైజ్ఞానిక విషయాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. స్త్రీల మనోభావాలకు, తెలివితేటలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ముఖ్యుల నుంచి ధన సహాయం లభించడంతో ఒక అడుగు ముందుకు వేస్తారు. 
 
తుల : ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారికి పనిభారం అధికమవుతుంది. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షల్లో ఏకాగ్రత అవసరం. సిమెంట్, ఐరన్, కలప, ఇటుక వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. హోటల్, తినుబండారాలు, క్యాటరింగ్ రంగాల వారికి పురోభివృద్ధి. కళ్యాణ మండపాల కోసం అన్వేషణ సాగిస్తారు. 
 
వృశ్చికం : దంపతుల మధ్య చిన్న చిన్న అభిప్రాయభేదాలు తలెత్తుతాయి. ఆప్తులతో నిజాయితీగా మెలగండి. ప్రైవేటు సంస్థలలోని వారికి ఒత్తిడి, పనిభారం తప్పవు. ఎంతటి వారినైన ఆకట్టుకుని వ్యవహారాలు చక్కదిద్దుతారు. విద్యుత్ రంగంలో వారు మాటపడక తప్పదు. స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. 
 
ధనస్సు : ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. కోర్టు వ్యవహారాలలో ఫ్లీడర్ల ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాలలో వారికి అనుకూలం. ద్విచక్రవాహనంపై దూర ప్రయాణాలు మంచిదికాదని గమనించండి. బంధువుల రాకలతో గృహంలో సందడి కానవస్తుంది. 
 
మకరం : ఫైనాన్స్, చిట్‌ఫండ్ రంగాలలో వారికి ఒత్తిడి పెరుగుతుంది. ఓర్పు, నేర్పుతో అనుకున్నది సాధిస్తారు. వ్యాపార రంగాలలో వారికి గణనీయమైన పురోభివృద్ధి పొందుతారు. కాంట్రాక్టర్లకు ఇప్పటివరకు వాయిదాపడుతున్న పనులు పునఃప్రారంభమవుతాయి. స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. 
 
కుంభం : కొబ్బరి, పండ్లు, పూల, కూరగాయల వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉపాధ్యాయులకు పనిభారం అధికం. ప్రింటింగ్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. స్త్రీలు అంతగా పరిచయం లేని వ్యక్తులకు దూరంగా ఉంచండి. రావలసిన ధనం సకాలంలో అందకపోవడం వల్ల నిరుత్సాహానికి గురవుతారు. 
 
మీనం : ఎల్.ఐ.సి, ఫిక్స్‌డ్ డిపాజిట్లకు సంబంధించిన సొమ్ము చేతికందుతుంది. ఆదాయ వ్యయాల్లో ఏకాగ్రత అవసరం. స్త్రీలకు వస్త్రాలు, విలువైన వస్తువులు కొనుగోలులో అవగాహన ముఖ్యం. పెద్ద హోదాలో ఉన్నవారికి ఆధికారిక పర్యటనలు అధికమవుతాయి. ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే కోరిక స్ఫురిస్తుంది.