ఆదివారం, 26 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : బుధవారం, 6 మే 2020 (08:07 IST)

06-05-2020 బుధవారం దినఫలాలు - లక్ష్మీనృసింహ స్వామిని ఆరాధిస్తే...

మేషం : తలపెట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదురవుతాయి. వాహనం నడుపుతున్నపుడు జాగ్రత్త అవసరం. నిర్మాణపనుల్లో కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు ఏకాగ్రత ముఖ్యం. ఉద్యోగస్తులు కొత్త వ్యక్తులు పట్ల అప్రమత్తంగా మెలగవలసి ఉంటుంది. ధనసహాయం, హామీలకు సంబంధించిన విషయాల్లో పునరాలోచన అవసరం. 
 
వృషభం : స్త్రీలకు పనివారలతో చికాకులు, ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. ప్రయాణాలు వాయిదాపడతాయి. రిప్రజెంటేటివ్‌లకు, ప్రైవేట్ సంస్థలలోని వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. కాంట్రాక్టర్లకు ఇంజనీరింగ్ విభాగం నుంచి ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సత్ఫలితాలిస్తాయి. 
 
మిథునం : ప్రింటింగ్ రంగంలోని వారికి అచ్చు తప్పులుపడుట వల్ల పైఅధికారులతో మాటపడక తప్పదు. స్త్రీలు షాపింగ్ వ్యవహారాలు, నూతన పరిచయస్తులతో అప్రమత్తత అవసరం. వ్యాపారాభివృద్ధికి కావలసిన ప్రణాళికలు అమలు చేస్తారు. మీ బంధువులను సహాయం అర్థించే బదులు మీరే ప్రత్యామ్నాయం చూసుకోవడం ఉత్తమం. 
 
కర్కాటకం : ప్రేమ వ్యవహారాల్లో తొందరపాటుతనంకూడదు. రుణాలు కోసం అన్వేషిస్తారు. వాహన చోదకులకు ఏకాగ్రత అవసరం. బంధువుల రాకతో కొంత అసౌకర్యానికి గురవుతారు. బ్యాంకు వ్యవహారాలు పనిభారం వల్ల చికాకు కలిగిస్తాయి. సమయానికి సహకరించని మిత్రుల తీరు నిరుత్సాహపరుస్తుంది. 
 
సింహం : రాజకీయ కళా రంగాల వారికి విదేశీ పర్యటనలు ఉంటాయి. మీ ఔదర్యాన్ని కొంతమంది దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. ఉద్యోగస్తులకు అధికారుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. దంపతుల మధ్య కొత్త కొత్త ఆలోనలు స్ఫురిస్తాయి. గృహ మరమ్మతులు, మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. 
 
కన్య : స్త్రీలు ఆంతరంగిక వ్యవహారాలు బయటకు వ్యక్తం చేయడం వల్ల ఇబ్బందులు తప్పవు. సొంత వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఉద్యోగస్తులు పైఅధికారుల నుంచి ఒత్తిడి అధికమవుతుంది. ధనవ్యయం, ధన సహాయం విషయంలో ఏకాగ్రత వహించండి. సోదరీ, సోదరులతో ఏకీభవించలేకపోతారు. 
 
తుల : దంపతుల మధ్య కలహాలు తలెత్తుతాయి. రాజకీయ నాయకులు సభలు, సమావేశాలలో పాల్గొంటారు. ఇంటికి అవసరమైన వస్తువులు సమకూర్చుకుంటారు. రాబడికి తగ్గ వ్యయం వల్ల ఆర్థిక ఇబ్బంది అంటూ ఏదీ ఉండదు. ఖర్చులు అధికమవుతాయి. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోవడం ఎంతైనా అవసరం. 
 
వృశ్చికం : వ్యాపారాభివృద్ధికి చేపట్టిన ప్రణాళికలు సత్ఫలితాలు ఇస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ప్రత్యర్థుల సైతం వీరి ఔన్నత్యాన్ని గుర్తిస్తారు. పెద్దల ఆరోగ్యంలో అధికమైన జాగ్రత్తలు అవసరం. బంధువర్గాల నుంచి విమర్శలు మాట పట్టింపులు ఎదురయ్యే అవకాశం ఉంది. మెళకువ వహించండి. 
 
ధనస్సు : స్త్రీలకు ఉదరం, మోకాళ్లు, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. కొబ్బరి, పండ్లు, పూలు, పానీయ వ్యాపారులకు శుభదాకయంగా ఉంటుంది. గృహ నిర్మాణాలు, మరమ్మతులతో జాప్యం. వ్యయం మీ అంచనాలు మించుతాయి. ఆదాయం పెంచుకునేందుకు చేసే యత్నాల్లో సఫలీకృతులవుతారు. 
 
మకరం : స్త్రీలు టీవీ, ఛానెల్స్ కార్యక్రమాలలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలకు ప్రోత్సాహం లభిస్తుంది. మొండి బాకీలు వసూలు కాగలవు. ప్రతి విషయంలోనూ పెద్దలతో సంప్రదింపులు చేయుట మంచిది. ఇతరులకు పెద్ద మొత్తంలో ధన సహాయం చేసే విషయంలో లౌక్యం అవసరం. 
 
కుంభం : ఆర్థిక విషయాల్లో ఒక అడుగు ముందుకు వేస్తారు. ఉద్యోగస్తులకు తోటివారి సహాయ సహకారాలు లభిస్తాయి. రచయితలకు పత్రికా రంగాల వారికి చికాకులు తప్పవు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి కలిసివచ్చే కాలం. ఓ మంచి వ్యక్తి అభిమానాన్ని పొందుతారు. నిరుద్యోగుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. 
 
మీనం : నూతన ప్రదేశ సందర్శనలపట్ల ఆసక్తి పెరుగుతుంది. నిర్మాణ పనులలో జాప్యం. అధిక వ్యయం వల్ల ఆందోళన గురవుతారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. గతంలో నిలిపివేసిన వ్యాపారాలు, పనులు పునఃప్రారంభించడానికి చేసే యత్నాలు ఫలిస్తాయి. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళకువ అవసరం.