మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : గురువారం, 19 డిశెంబరు 2019 (09:33 IST)

19-12-2019 గురువారం మీ రాశి ఫలితాలు

మేషం: సినిమా, కళా రంగాల్లో వారికి అభిమాన బృందాలు అధికమవుతాయి. ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. బ్యాంకు వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. స్త్రీలకు బంధువుల రాక వల్ల పనులు వాయిదా పడతాయి. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు.
 
వృషభం: ఉద్యోగస్తులు అధికారులకు వివరణ ఇచ్చుకోవాల్సి వుంటుంది. పత్రికా సంస్థల్లోని వారికి ఏకాగ్రత, పునఃపరిశీలన ప్రధానం. మీ కళత్ర వైఖరి మీకు ఎంతో చికాకు, ఆందోళన కలిగిస్తుంది. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. ఆదాయానికి తగ్గట్టుగా బడ్జెట్ రూపొందించుకుంటారు.
 
మిథునం: వ్యాపారాల్లో కొత్త కొత్త ప్రణాళికలు, పథకాలతో వినియోగదారులను ఆకట్టుకుంటారు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి. ఆకస్మిక ఖర్చులు, చెల్లింపుల వల్ల ఒడిదుడుకులు తప్పవు. పెంపుడు జంతువుల పట్ల ఆసక్తి అధికమవుతుంది. మార్కెట్ రంగాల వారికి శ్రమాధిక్యత మినహా ప్రతిఫలం అంతగా వుండదు.
 
కర్కాటకం: చిత్తశుద్ధితో మీరు చేసిన సహాయానికి, సేవలకు మంచి గుర్తింపు లభిస్తుంది. నూతన రుణాల కోసం అన్వేషిస్తారు. పెద్దల జోక్యంతో అనుకోకుండా ఒక సమస్య సానుకూలమవుతుంది. ఎదుటివారితో మితంగా సంభాషించడం మంచిది. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి గుర్తింపు, గౌరవం లభిస్తాయి.
 
సింహం: ప్రతి విషయంలోను ఓర్పుతో వ్యవహరించాలి. రుణాలు తీరుస్తారు. ఉపాధ్యాయులకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. దైవ సేవా కార్యక్రమాలకు ధనం అధికంగా ఖర్చు చేస్తారు. రాజకీయ నాయకులు అధికారులతో సమావేశాలు, పర్యటనల్లో పాల్గొంటారు. చిన్ననాటి పరిచయస్తుల కలయిక సంతోషం కలిగిస్తుంది. 
 
కన్య: ఉద్యోగ యత్నంలో బిడియం, భేషజం తగదు. దాన ధర్మాలు చేసి సంఘంలో మంచి పేరు, ఖ్యాతి గడిస్తారు. వాహనం నడుపుతున్నప్పుడు జాగ్రత్త అవసరం. నూతన రుణాల కోసం అన్వేషిస్తారు. పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాల వారికి సామాన్యంగా ఉంటుంది. మీ అభిప్రాయాలను మీ శ్రీమతికి సూచనప్రాయంగా తెలియజేయండి. 
 
తుల: ప్రైవేట్ సంస్థల్లో వారికి తోటి వారి కారణంగా సమస్యలు తలెత్తగలవు. నోరు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. బ్యాంకు వ్యవహారాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం. దైవ సేవాకార్యక్రమాల కోసం ధనం బాగుగా ఖర్చు చేస్తారు. మీ అభిరుచికి తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు.
 
వృశ్చికం: స్త్రీలకు షాపింగ్ వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. ఉద్యోగ ప్రకటనలపై ఏకాగ్రత వహించండి. స్థిరాస్తి విక్రయంలో తొందరపాటు తగదు. దంపతులకు ఏ విషయంలోను పొత్తు కుదరదు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు నిరుత్సాహం కలిగిస్తాయి. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో ఇబ్బందులను ఎదుర్కొంటారు.
 
ధనస్సు: వ్యాపారస్తులు ఊహించని లాభాలను సొంతం చేసుకుంటారు. సోదరీ, సోదరుల మధ్య సంబంధ బాంధవ్యాలు బాగా ఉంటాయి. మీ శ్రీమతి సూటిపోటి మాటలు అసహనం కలిగిస్తాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. రవాణా, మెకానిక్ రంగాల్లో వారికి చికాకులు తప్పవు.
 
మకరం: శత్రువులు సైతం మిత్రులుగా మారి చేయూతనిస్తారు. చిన్నారులు, ప్రియతములతో ఉల్లాసంగా గడుపుతారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి వుంటుంది. ప్లీడర్లకు, ప్లీడరు గుమాస్తాలకు వృత్తిపరమైన చికాకులు ఎదుర్కోవలసివస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. 
 
కుంభం: వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. మీ అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. స్త్రీలతో మితంగా సంభాషించడం శ్రేయస్కరం. రిప్రజెంటేటివ్‌లకు, ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి. పాత రుణాలు తీర్చడంతో పాటు విలువైన పరికరాలు అమర్చుకుంటారు. 
 
మీనం: ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికం. స్త్రీలకు కోరుకునే మార్పులు నిదానంగా అనుకూలిస్తాయి. మీ సాయంతో ఒకరికి ఉద్యోగావకాశం లభిస్తుంది. సంతానం వైఖరి చికాకు కలిగిస్తుంది. ఆడిటర్లకు, అకౌంటెంట్లకు ఒత్తిడి, పనిభారం అధికమవుతాయి. రావలసిన మొండి బాకీలు వాయిదా పడతాయి.