శనివారం, 30 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : గురువారం, 2 మే 2019 (11:21 IST)

02-05-2019నాటి రాశి ఫలితాలు.. ధనరాబడిని అన్వేషించి నడుచుకుంటారు

మేషం: చేతివృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. స్త్రీలకు అధిక శ్రమ, నిరుత్సాహం తప్పదు. మార్కెటింగ్ రంగాలవారికి, ప్రైవేటు సంస్థలలోని వారికి ఓర్పు, అంకితభావం చాలా అవసరమని గమనించండి. ఫ్యాన్సీ, మందులు, సుగంధ ద్రవ్య, ఆల్కహాలు వ్యాపారులకు పురోభివృద్ధి. ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు లభిస్తుంది.
 
వృషభం: రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు విరోధులు వేసే పథకాలు ఎంతో ఆందోళన కలిగిస్తాయి. నిరుద్యోగులు తమ ఆలోచనలు క్రియా రూపంలో పెట్టిన పురోభివృద్ధి కానరాగలదు. ఉపాధ్యాయులకు బరువు, బాధ్యతలు అధికమవుతాయి. స్త్రీలు ఆడంబరాలకు, పంతాలకు పోవడం వలన ఇబ్బందులు తప్పవు.
 
మిధునం: ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, వాణిజ్య ఒప్పందాల్లో మెళకువ అవసరం. ఇతరుల కారణంగా మీ కార్యక్రమాలు వాయిదా పడుతాయి. బంధువుల రాకపోకులు అధికమవుతాయి. ప్రముఖుల కలయిక సాధ్యం కాదు. విజయాలు తేలికగా సొంతమవుతాయి. ద్విచక్ర వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం.
 
కర్కాటకం: అన్ని విషయాలందు ధనరాబడిని అన్వేషించి నడుచుకుంటారు. సన్నిహితుల మధ్య విభేదాలు తలెత్తుతాయి. పోస్టల్, టేలిగ్రాఫ్, ఎల్.ఐ.సి., రంగాలవారికి కలిసివచ్చును. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఆకస్మిక ఖర్చులు, తప్పనిసరి చెల్లింపులు ఇబ్బంది కలిగిస్తాయి.
 
సింహం: స్థిరాస్తిని అమర్చుకుంటారు. మీపై ఇతరులకు ఈర్ష్య, అసూయ, ద్వేషం వంటివి కలగే అవకాశం ఉంది. వీలయితే కీలకమైన నిర్ణయాలు ఈ రోజుకు వాయిదా వేయడం మంచిది. హోటలు, తినుబండ, క్యాటరింగ్ రంగాలలో వారికి సదవకాశాలు లభిస్తాయి. ఆర్థిక సమస్యల నుండి బయటపడుతారు.
 
కన్య: ఉద్యోగస్తులు అధికారులను తక్కువ అంచనా వేయడం వలన ఇబ్బందులను ఎదుర్కోవలసివస్తుంది. శారీరకశ్రమ, మానసిక ఒత్తిడి వలన అస్వస్థతకు గురవుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. స్త్రీలకు తల, కళ్ళు, కాళ్ళు, నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కోక తప్పదు. ఖర్చులు అధికమైనా ఆర్థిక ఇబ్బందులు అంతగా ఉండవు.
 
తుల: ముఖ్యమైన విషయాలు మీ జీవిత భాగస్వామికి తెలియజేయడం మంచిది. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, దానికి అనువైన పరిస్థితులు నెలకొంటాయి. మీ ఆశయ సాధనకు ఉన్నత స్థాయి వ్యక్తులు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తారు. కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయల వ్యాపారులకు పురోభివృద్ధి.
 
వృశ్చికం: ఉద్యోగ, వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. మీ తొందరపాటుతనం ఇబ్బందులకు దారితీస్తుంది. ప్రయాణాలు, బ్యాంకింగ్ వ్యవహారాల్లో ఏకాగ్రత వహిస్తారు. మీ అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలేర్పడుతాయి. మీ పథకాలు కార్యరూపం దాల్చుతాయి. గృహంలో మార్పులు చేర్పులు అనూకూలిస్తాయి.
 
ధనస్సు: బంధువులతో ఉల్లాసంగా గడుపుతారు. ఖర్చులు అధికం కావడంతో అదనపు సంపాదన పట్ల దృష్టి సారిస్తారు. కాంట్రాక్టర్లకు నూతన టెండర్ల విషయంలో పునరాలోచన అవసరం. చేతి వృత్తుల వారికి అన్ని విధాలా కలిసివస్తుంది. ప్రింటింగ్ రంగాలవారికి బాకీలు వసూళ్ళల్లో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు.
 
మకరం: ఆస్థి వ్యవహారాల విషయంలో కుటుంబీకుల నిర్ణయం నిరుత్సాహం కలిగిస్తుంది. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి ఊహించని చికాకులు ఎదురవుతాయి. ఆదాయం బాగున్నా ఆర్థికస్థితి ఏమంత సంతృప్తికరంగా ఉండదు. గతంలో మిమ్మల్ని విమర్శించిన వారే మీ పురోభివృద్ధిని, ఖ్యాతిని గుర్తించి కొనియాడతారు.
 
కుంభం: పెద్దల ఆరోగ్యంలో మెళకువ అవసరం. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థినులకు దూరప్రాంతాల్లో ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత ముఖ్యం. ఆత్మీయుల నుండి ముఖ్యమైన సమాచారం అందుకుంటారు.
 
మీనం: భాగస్వామికుల మధ్య అవగాహన లోపిస్తుంది. నిర్మాణ పనుల్లో నాణ్యత లోపం వలన బిల్డర్లకు, కాంట్రాక్టర్లకు ఇబ్బందులు తప్పవు. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. బంధువుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. పెంపుడు జంతువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మార్కెట్ రంగాలవారికి ఒత్తిడి, పెరుగుతుంది.