మంగళవారం, 1 ఏప్రియల్ 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : గురువారం, 27 మార్చి 2025 (23:00 IST)

Friday: శుక్రవారం అప్పు తీసుకోవద్దు.. అప్పు ఇవ్వకూడదు.. ఇవి తప్పక చేయకండి..

Lakshmi Devi
శుక్రవారం మాత్రం అప్పు తీసుకోకూడదు.. అప్పు ఇవ్వకూడదు అంటున్నారు జ్యోతిష్య నిపుణులు. ఒకవేళ ఎవరైనా అత్యవసరంగా డబ్బు అప్పుగా అడిగితే ఆర్థిక సాయం చేయండి కానీ అప్పుగా ఇవ్వకూడదు. అలాగే ఎవరి నుంచి చేబదులు కానీ, అప్పు గాని తీసుకోకూడదు. అలా చేస్తే జీవితాంతం అప్పుల ఊబిలో కూరుకుపోవడం ఖాయం అంటున్నారు ఆధ్యాత్మిక పండితులు. 
 
ప్రతిరోజూ సాయంత్రం దీపాలు వెలిగించే సమయంలో ఇంటి ప్రధాన ద్వారం తెరిచి ఉంచి లక్ష్మీదేవికి ఆహ్వానం పలకాలి. ఏ ఇంటి ప్రధాన ద్వారం, సంధ్యా సమయంలో మూసి ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించదు. కాబట్టి సిరిసంపదలు కోరుకునేవారు సంధ్యా సమయంలో ఇంటి ద్వారం తెరిచి ఉంచాలి.
 
ఇంకా లక్ష్మీదేవి ముఖ్యంగా పరిశుభ్రతను ఇష్టపడుతుంది. శుక్రవారం ఇంటిని శుభ్రం చేయడంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అయితే సూర్యాస్తమయం తర్వాత మాత్రం ఇంటిని శుభ్రం చేయవద్దు. శుక్రవారం రోజున చక్కెరను దానం చేయకూడదు లేదా అప్పుగా తీసుకోకూడదు. ఇలా చేయడం వల్ల శుక్ర గ్రహం బలహీనంగా మారుతుంది. సుఖ సంతోషాలు, కీర్తిలు శుక్ర గ్రహ కారకాలని విశ్వాసం.
 
శుక్రుడు బలహీనంగా ఉంటే ఇంట్లో ఆనందం, శాంతి , శ్రేయస్సు లోపిస్తుంది. శుక్రవారం ఇంట్లో ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పండి. ఈ రోజున అన్ని రకాల తగాదాలకు దూరంగా ఉండండి. ఇలా చేస్తే.. శ్రీలక్ష్మీ దేవి ఆ ఇంట కొలువై వుంటుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.